టీడీపీ కి అన్ని సీట్లు రానున్నాయి ...విజయ్ కుమార్..!

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు మూడు , నెలల హడావిడి తర్వాత మే 13 వ తేదీన అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఎన్నికలలో ఈ సారి పోయిన సారి కంటే కాస్త ఎక్కువ ఓటింగ్ శాతం నమోదు కావడంతో అవి మాకు అనుకూలం అంటే మాకు అనుకూలం అంటూ వైసీపీ కూటమి నేతలు చెబుతూ వస్తున్నారు. ఇక రేపు ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తమ నివేదికలను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

అందులో భాగంగా కొన్ని సంస్థలు వైసిపి అధికారంలోకి రాబోతుంది అని అంచనా వేయగా , మరికొన్ని కూటమి అధికారం లోకి రాబోతుంది అని అంచనా వేశాయి. ఇకపోతే తాజాగా తెలుగు దేశం పార్టీకి సొంతగా ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే విషయంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి నిలయపాలెం విజయ్ కుమార్ స్పందించాడు. తాజాగా ఈయన మాట్లాడుతూ ... కేవలం తెలుగు దేశం పార్టీనే 90 నుండి 100 అసెంబ్లీ స్థానాలను దక్కించుకోబోతుంది అని ఈయన చెప్పుకొచ్చాడు.

ఇక ఈయన చెప్పినట్లు తెలుగు దేశం పార్టీ సొంత గానే 90 నుండి 100 అసెంబ్లీ స్థానాలను కనుక గెలుపొందినట్లు అయితే ఇతర పార్టీల మద్దతు లేకుండానే అధికారం లోకి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కాస్త అటు ఇటు అయినప్పటికీ తెలుగు దేశం పార్టీ కి ఏ డోకా లేదు. ఎందుకు అంటే ఈ సారి ఎన్నికల్లో తెలుగుదేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. ఇక జనసేన , బీ జే పీ లకు కూడా భారీ ఎత్తున సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానితో తెలుగు దేశం పార్టీకే సొంతగా 90 నుండి 100 సీట్లు వస్టే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ఎలాంటి టెన్షన్ లేకుండా అధికారంలోకి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tp

సంబంధిత వార్తలు: