ఆరెంజ్ రిజల్ట్ వస్తే పవన్ స్ట్రాటజీ మారనుందా..?

Pulgam Srinivas
పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరం జనసేన పార్టీని స్థాపించాడు. కానీ ఈ పార్టీని స్థాపించిన తర్వాత ఎలక్షన్లకు మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉండడంతో ఆ సారి పవన్ మరియు తన పార్టీ ఎలక్షన్లలో పాల్గొనలేదు. 2019 వ సంవత్సరం జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో పాల్గొంది. ఈ సారి ఎన్నికల్లో జనసేన పార్టీ కి ఊహించిన దెబ్బ తగిలింది. ఈ పార్టీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలలో , పార్లమెంటు స్థానాలలో పవన్ అభ్యర్థులను బరిలో ఉంచాడు.

అందులో భాగంగా పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేశాడు. పవన్ రెండింటిలోనూ ఓడిపోగా , ఈ పార్టీ అభ్యర్థులలో కేవలం ఒకే ఒక్క వ్యక్తి అసెంబ్లీ స్థానాన్ని గెలుపొందాడు. అలా ఈ పార్టీ కి 2019 వ సంవత్సరం భారీ దెబ్బ తగిలింది. ఇకపోతే 2024 వ సంవత్సరం అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో గాను ఈ పార్టీ టి డి పి , బి జె పి తో పొత్తులో భాగంగా పోటీ చేస్తుంది. అందులో భాగంగా జనసేన 22 అసెంబ్లీ స్థానాలను  , 2 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంది. ఇక రెండు రోజుల క్రితమే ఎగ్జిట్ పోల్స్ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే.

అందులో భాగంగా జనసేన పోటీ చేసిన 22 అసెంబ్లీ స్థానాలలో 14 నుండి 20 గెలిచి అవకాశాలు ఉన్నట్లు 2 పార్లమెంట్ స్థానాలలో రెండు గెలిచే అవకాశం ఉన్నట్లు చాలా వరకు నివేదికలు వచ్చాయి. దానితో జనసేన పార్టీ క్రేజ్ భారీగా పెరిగినట్లు జనాలు భావిస్తున్నారు. ఒక వేళ ఇదే స్థాయి రిజల్ట్ కూడా వస్తే పవన్ స్ట్రాటజీ పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయి అని అనేక మంది భావిస్తున్నారు. ఈ రకం రిజల్ట్ వచ్చినట్లు అయితే జనసేన పార్టీ భవిష్యత్తు మారబోతుంది అని కూడా చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: