కౌం (హం) టింగ్ : అక్కడ ఘర్షణకు తావే లేదు... చేస్తే ఇక అంతే..?

Pulgam Srinivas
ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్ అనేది చేయడం ద్వారా ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి? ఎవరు గెలిచారు? ఎంత మెజారిటీతో గెలిచారు? ఓడిపోయిన వారు ఎన్ని ఓట్లతో ఓడిపోయారు ఇలా అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది. ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఓడిపోతాము అని భయం ఉన్న వర్గాలు కావచ్చు... గెలుపు వల్ల విర్రవీగే తనం వల్ల కావచ్చు గొడవలు జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.

ఇలా ఓట్ల లెక్కింపు రోజు భారీ స్థాయిలో గొడవలు జరిగిన సందర్భాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. అలాంటి ఘర్షణలు ఏమాత్రం జరగకూడదు అనే ఉద్దేశంతో ఏ ప్రాంతంలో అయితే ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతంలో ఎలక్షన్ కమిషన్ , పోలీసు సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా మనం తెలుసుకోవాల్సింది 144 సెక్షన్. ఈ సెక్షన్ ప్రకారం దీనిని అమలు చేసిన పరిధిలో ఎవరు కూడా గుంపులు గుంపులుగా తిరిగిన , అల్లరి చేయడానికి ప్రయత్నించినట్లు అయితే వెంటనే అరెస్ట్ చేస్తారు.

ఇక ఓట్ల లెక్కింపు జరుగుతున్న  పరిధిలో ఎవరైనా గొడవలు చేయడానికి ప్రయత్నించిన వారి వెంటనే అరెస్టు చేసి ఆ గొడవలను అక్కడే ఆపే విధంగా ఎలక్షన్ కమిషన్ , పోలీస్ సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటుంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా చాలా విడతల్లో దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరిగాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. వాటికి సంబంధించిన ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. దానితో దేశంలోని అనేక ప్రాంతాలలో రేపు చాలా సెంటర్లలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగబోతుంది. ఇక ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఎలాంటి అవరోధాలు , ఘర్షణ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ పోలీస్ సిబ్బంది ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలను చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: