జగన్ కి అంతకన్నా తక్కువ సీట్లతో అధికారం వచ్చిన ప్రయోజనం లేదా..?

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ ఎలక్షన్ లకి సంబంధించిన ఫలితాలు రేపు అనగా జూన్ 4 వ తేదీన విడుదల కానున్నాయి. ఈ ఫలితాల గురించి ఆంధ్ర రాష్ట్ర నాయకులు , కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ ఫలితాలకు ముందే చాలా ప్రముఖ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో తమ నివేదికలను విడుదల చేశాయి.

ఆ నివేదికలలో కొన్ని అత్యంత ప్రాచుర్యం పొందిన నివేదికలు వై సి పి పార్టీ కి 100 నుండి 110 లోపు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పుకోచ్చాయి. దీనితో చాలా మంది ఆలోచనలో పడ్డారు. ఎందుకు అంటే ఆ నివేదికల ప్రకారం జగన్ కి 100 నుండి 110 లోపు సీట్లు కనుక వచ్చినట్లు అయితే ఆయన పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అది ఎంతో కాలం నిలబడదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకు అంటే 100 నుండి 110 సీట్లు కనక వచ్చినట్లు అయితే ఒకటి లేదా రెండు సంవత్సరాల లోపు వై సీ పీ కి సంబంధించిన కొంత మంది ఎమ్మెల్యేలను ఇతర వర్గం తమ వద్దకు తీసుకొని అవకాశం ఉంది.

దానితో ఒకటి లేదా రెండు సంవత్సరాల లోపు జగన్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం కూడా ఉంటుంది. అందుకే జగన్ గెలిచినా కూడా120 , 125 ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకుంటూనే ప్రయోజనం ఉంటుంది అని అంతకన్నా తక్కువ సీట్లు వచ్చి వై సి పి పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ అధికారం ఎంతో కాలం ఉండదు అని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్ ప్రభుత్వం ఎగ్జిట్ పోల్స్ నివేదికల ప్రకారం 110 లోపు స్థానాలనే దక్కించుకుంటుందా ..? లేక ఎక్కువ దక్కించుకుంటుందా ..? మరి తక్కువ దక్కించుకుంటుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: