కౌం(హం) టింగ్ : హస్తం కాదు.. చర్ఖా లేదు.. 1971లో ఇందిర సృష్టించిన ప్రభంజనం తెలుసా?

Reddy P Rajasekhar
స్వతంత్ర భారతావనిలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ ఎన్నికలపై ప్రజల దృష్టి పూర్తిస్థాయిలో ఉంటుంది. మంచి ప్రధానమంత్రి, మంచి ముఖ్యమంత్రిని ఎంచుకుంటే తమ జీవితాలు మారిపోతాయని చాలామంది భావిస్తారు. అయితే స్వతంత్ర భారతావనిలో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల ప్రక్రియ రూపురేఖలను మార్చేసిన ఎన్నికలు ఏవనే ప్రశ్నకు 1971 ఎన్నికలు అనే సమాధానం వినిపిస్తుంది.
 
ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు కాగా ఇందిర కాంగ్రెస్ (ఆర్) పేరుతో ఎన్నికల బరిలోకి దిగితే కాంగ్రెస్ లోని వృద్ధ నాయకులు కాంగ్రెస్ (ఓ) పేరుతో ఎన్నికల బరిలోకి దిగారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ పార్టీ ఎన్నికల గుర్తు ఆవు, పాలు తాగుతున్న దూడ కాగా కాంగ్రెస్ (ఓ) గుర్తు చర్ఖా తిప్పుతున్న మహిళ కావడం గమనార్హం. 1971లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దాదాపుగా 15 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.
 
ఆ ఎన్నికల్లో మొత్తం 545 స్థానాలకు ఎన్నికలు జరగగా దాదాపుగా 2800 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇందిరా గాంధీ నేతృత్వంలోని పార్టీకి ఆ సమయంలో 352 స్థానాలలో విజయం దక్కగా కాంగ్రెస్ (ఓ)కి కేవలం 16 స్థానాల్లో మాత్రమే విజయం దక్కింది. హస్తం, చర్ఖా లేకున్నా ఇందిరా గాంధీ సృష్టించిన ప్రభంజనం మాత్రం అంతాఇంతా కాదనే చెప్పాలి.
 
ఈ ఎన్నికల సమయంలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరగగా చాలా చోట్ల రిగ్గింగ్, బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు, ఇంకు పోయడం ఇలా చాలా కుట్రలు జరిగాయి. కొన్నిచోట్ల బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లి పోవడం కూడా జరిగింది. అయితే అప్పటితో పోల్చి చూస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయనే చెప్పాలి. అప్పట్లో ఇందిరా గాంధీ సృష్టించిన ప్రభంజనం గురించి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారంటే అప్పట్లో పరిస్థితులు ఏ విధంగా ఉండేవో సులువుగానే అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: