వైసీపీ ఫైర్ బ్రాండ్స్ కు చుక్కలు చూపించిన పవన్ కళ్యాణ్‌?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు మే 13వ తేదీన జరగగా... ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన రాబోతున్నాయి. ఇక ఎగ్జిట్ ఫలితాలు శనివారం రోజున రిలీజ్ అయ్యాయి. ఇందులో కొన్ని వైసిపి గెలుస్తాయని చెప్పగా మరికొన్ని సర్వే సంస్థలు తెలుగుదేశం కూటమికి ఎడ్జ్  ఇచ్చాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్స్  ను జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వనికించారట.

 
పవన్ కళ్యాణ్  కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన కూటమిలో చేరడం... వైసీపీలో ఉన్న కీలక నేతలకు మైనస్ అయిందట. చాలామంది కాపు నేతలు వైసిపికి ఓటు వేయకుండా.. తెలుగుదేశం కూటమి తరఫున ఏ అభ్యర్థి నిలిచి ఉంటే ఆ అభ్యర్థికి ఎక్కువగా ఓటు వేశారట. గుడివాడ నియోజకవర్గంలో  కొడాలి నాని కచ్చితంగా గెలుస్తానని అందరు అనుకున్నారు. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ కారణంగా... కాపు ఓట్లు మొత్తం  తెలుగుదేశం అభ్యర్థికి పడ్డాయట. దాంతో కొడాలి నాని అక్కడ గెలవడం కష్టమని అంటున్నారు.


 ఇటు మంత్రి రోజా నియోజకవర్గం నగరిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. వైసిపి సొంత నేతలు రోజాను వ్యతిరేకించడం... కాపు నేతలు అలాగే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫ్యాన్స్, ఇతరులు... తెలుగుదేశం కూటమికి వేశారట. అటు నెల్లూరు సిటీని వదిలి నరసరావుపేట ఎంపీగా ఈసారి బరిలో ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్. అయితే ఆయనకు యాదవ్ ఓట్లు కచ్చితంగా పడ్డాయి కానీ.. నరసరావుపేట లో ఉన్న కాపు ఓట్లు మాత్రం... పవన్ కళ్యాణ్ వల్ల ఆయనకు పని లేదని తెలుస్తోంది.

 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాపు ఫీవర్ కనిపించడంతో తన కుమారుని గెలుపోటములపై లెక్కలు కడుతున్నారట పేర్ని నాని. అయితే నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ తో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు బలంగా జరగడంతో ఇవన్నీ తన కొడుకు విజయానికి కలిసొచ్చే అంశాలుగా చూస్తున్నారు పేర్ని నాని. సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు కూడా ఇదే పరిస్థితి నెలకొందట. అంబటి రాంబాబుకు పడే కాపు ఓట్లు... పవన్ కళ్యాణ్ కారణంగా చీలిపోయి కన్నా లక్ష్మీనారాయణకు పడినట్లు చెబుతున్నాయి సర్వే సంస్థలు. ఇలా ప్రతి ఒక్క నాయకునికి... పవన్ కళ్యాణ్ చుక్కలు చూపించారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: