కౌం ( హం ) టింగ్ : 1991లో అక్కడ రక్తపాతం.. దీని నుంచి ఈసీ ఒక్క విషయమైనా నేర్చుకుందా..??

Suma Kallamadi
భారతదేశంలో, ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. 1991 పాట్నాలో జరిగిన అల్లర్లు చాలామందికి షాకిచ్చాయి. బీహార్‌లోని పాట్నాలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆ హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీని ఫలితంగా పలువురు మృతి చెందగా, చాలామంది గాయపడ్డారు.తీవ్రమైన రాజకీయ శత్రుత్వం, ఎన్నికల మోసాలకు సంబంధించిన ఆరోపణలు కారణంగా ఈ గొడవలు జరిగాయి. అంతేకాదు, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య జరిగింది. దాని తర్వాత ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. దీని వల్ల కూడా గొడవలు అయ్యాయి.
ఓట్ల రిగ్గింగ్, ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు స్వైర విహారం చేయడం వల్ల పార్టీ మద్దతుదారులు గొడవలకు తెగబడ్డారు. మోసపోయామని భావించి కౌంటింగ్ డే రోజున ఇష్టం వచ్చినట్లు కొట్లాడుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. బలమైన చట్టాన్ని అమలు చేసేవారు లేకపోవటం వల్ల ఘర్షణలు చెలరేగడం, తీవ్రతరం కావడం చక చకా జరిగిపోయాయి.
ఈ అల్లర్ల నుంచి ఏం నేర్చుకోవాలి ? హింసను అరికట్టడానికి, శాంతిభద్రతలను కాపాడేందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద తగినంత భద్రతా సిబ్బంది ఉండేలా చూసుకోవాలి. ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని పెంపొందించడానికి ఎన్నికల మోసానికి సంబంధించిన ఆరోపణలను వేగంగా, పారదర్శకంగా దర్యాప్తు చేసి పరిష్కరించాలి. ఇందుకు బలమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలి.
కొట్లాటలు, చంపుకోవడం వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్టీలన్నీ శాంతియుతంగా కలిసి మాట్లాడుకునేలా ప్రోత్సహించాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గొడవలు జరుగుతాయి అని అనుకుంటే వాటిని వెంటనే కంట్రోల్లోకి తీసుకొచ్చేలాగా బలగాలను మొహరించాలి. గొడవలు లేకుండా పక్కగా ప్లాన్స్‌ రచించుకోవాలి. ఎన్నికల సంఘం ఇందులో ఏది కూడా పెద్దగా నేర్చుకోలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో మొన్న కూడా  భారీ ఎత్తున గొడవలు జరిగాయి. అది కౌంటింగ్ రోజున కాదు కానీ పోలింగ్ రోజున జరిగాయి. రేపే కౌంటింగ్ డే, ఆరోజు కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఈసీ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: