ఏపీ : కౌంటింగ్‌ కేంద్రాల్లో వారిని గెంటేస్తాం..కొత్త రూల్స్‌ ఇవే?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. జూన్ 4వ తేదీన అంటే మంగళవారం ఉదయం నుంచి  కౌంటింగ్ ప్రారంభం ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

 
 పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిందేనని  స్పష్టం చేశారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయిన వెంటనే ప్రతి ఈవీఎంలకు సీల్ వేసి భద్రపరచాలని స్పష్టమైన ఆదేశాలకు ఇచ్చారు. అంతే కాకుండా... శాంతి భద్రతల విషయంలో పోలీసులు అలర్ట్ గా ఉండాలన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ కు ఒక ఏజెంట్ ను నియమించుకునే అవకాశాన్ని అభ్యర్థికి కల్పించాలని... అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.

 
 అంతేకాకుండా ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఏజెంట్ కు అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫామ్ 17 సి  ఉండాలన్నారు. పెన్ను లేదా పెన్సిల్, ప్లేన్ పేపర్ మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. అంతకుమించి ఏది కూడా అనుమతించవద్దని... సెల్ ఫోన్ వాడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అథారిటీ లెటర్స్ కలిగిన జర్నలిస్టులు మీడియా కేంద్రంలోకి రావచ్చన్నారు. అలాగే వారు సెల్ఫోన్ వాడినా పెద్ద ఇబ్బంది లేదని తెలిపారు.

 
 కానీ కౌంటింగ్ కేంద్రంలో... సెల్ఫోన్ వాడకూడదని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలన్నీ అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో కూడా ఉండాలని తెలిపారు. ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన అలర్టుగా అగ్నిమాపక సిబ్బంది ఉండాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఎంట్రీ మరియు ఎగ్జిట్ ప్రణాళిక పటిష్టంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గొడవలు సృష్టించిన ఏజెంట్లను బయటకు పంపిచాలన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: