ఏపీ : ఓడినా.. గెలిచినా.. రోజా అవసరం జగన్ కు ఉందా..?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్‌లో కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి రోజా వివరించారు. జనం మరోసారి వైసీపీకి పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. విజయంపై కొందరు నాటకాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసి ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబట్టారని ఆరోపించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఎలా ఆపలేరో.. అదేవిధంగా వైసీపీ గెలుపును ఆపలేరని రోజా స్పష్టం చేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్ సంబంధం లేదని మంత్రి రోజా తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారం చేపట్టడం ఖాయం అంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేస్తారని స్పష్టం చేశారు.

ఇవాళ తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ… ఎన్నికల ఫలితాలపై ఎవరికి నచ్చినట్లు వారు వాఖ్యలు చేస్తూన్నారన్నారు.ప్రజలు సంక్షేమానికి…అభివృద్దికి పట్టం కడుతున్నారని చెప్పారు. 2014లో కూటమి అధికారంలోకి వచ్చినా….ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఓరిగింది ఏమి లేదని వెల్లడించారు.చంద్రబాబు ఇష్టానుసారం వ్యవస్థలను మేనేజ్ చేస్తూన్నాడని ఆగ్రహించారు.మంత్రి రోజాతో పాటు మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆరా మస్తాన్ సర్వే ప్రకారం రోజా ఓడిపోతుంది అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానిపై స్పందించిన రోజా ఇంకొక రోజు ఆగితే  అసలు విషయం తెలుస్తుందనినవ్వుతూ సమాధానం చెప్పారు.

ఇప్పుడు అసెంబ్లీలో రోజా లేకపోతే... వైసిపికి చాలా కష్టం. కాబట్టి ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కొంతమంది అంటున్నారు. ఆ దిశగా జగన్ కూడా ఆలోచిస్తారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆమెకు మంత్రి పదవి కూడా ఇస్తారని కొంతమంది వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాగే నిత్యం మీడియా ముందుకు వెళ్లి... పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబుపై విమర్శలు చేసేలా అయినా ఒక పదవి ఇవ్వాలని కొంతమంది వైసిపి నేతలు డిమాండ్ చేస్తున్నారట. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కచ్చితంగా రోజాకు ఏదో ఒక పదవి వస్తుందని ఆమె అనుచరులు మాత్రం ధీమాగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: