ఆంధ్రా అసెంబ్లీ : ఈసారి జగన్ సినిమాలో దూకుడు నేతల సంగతేంటి..?

FARMANULLA SHAIK

* జబర్దస్త్ కి తిరిగి రాబోతున్న రోజా..?
* జగన్ సినిమాతో నష్టపోబోతున్న నిర్మాత నాని..?
* సంబరాల రాంబాబు సంగతేంటి.?

మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగింది.ఇలాంటి నేపథ్యంలో అందరూ ఈ ఫలితాల కోసం మాత్రమే ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి.అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్‌ వైసీపీకే పట్టం కట్టాయి.అన్నీ సర్వేల్లో కల్ల మంచి క్రెడిబులిటీ ఉన్న ఆరా సర్వే కోసం అందరు ఉత్కంఠగా ఎదురుచూసారు అయితే మస్తాన్ ప్రకారం ఆరా సర్వే వైసీపీకి పట్టం కట్టింది. ఆరా ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైసీపీకి 94 నుంచి 104 అసెంబ్లీ సీట్లు వస్తాయి. టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయి. వైసీపీకి 49.41 శాతం, కూటమికి 47.55 శాతం ఓటు శాతం వస్తుందని ఆరా పేర్కొంది. జగన్‌కు మహిళలు జై కొట్టారని, 56 శాతం మహిళలు ఫ్యాను గుర్తుకు ఓటేశారని ఆరా పేర్కొంది. కూటమికి 43 శాతం మహిళలు మద్దతిచ్చారని తెలిపింది. ఇక పురుషుల్లో వైసీపీ కంటే కూటమికి 6 శాతం ఎక్కువగా ఓట్లు వచ్చాయని తెలిపింది. మంత్రులు సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్‌, కారుమూరి, చెల్లుబోయిన, కొట్టు సత్యనారాయణ, విడదల రజనీ, ఆదిమూలం సురేష్‌, ఉషశ్రీ చరణ్‌, ఆర్కే రోజా, స్పీకర్ తమ్మినేని ఓడిపోతారన్నారని మంత్రులు ధర్మాన, జోగి రమేష్‌, అంబటి రాంబాబు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారన్నారని ఆరా సర్వేలో తేలింది.

వైయస్ఆర్సీపీకి చెందిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. ఈ సారి నగరి నుంచి ఓడిపోవడం ఖాయం అంటున్నాయ. వైసీపీ గెలుస్తుందన్న ఆరా వంటి సంస్థలు కూడా రోజా హాట్రిక్ కొట్టడం డౌటే అంటున్నాయి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజా.. రెండు సార్లు ఓటమి పాలై మూడో సారి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఈ సారి ఎన్నికల్లో తన సమీప తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి గాలి భాను ప్రకాష్ చేతిలో ఓటమి పాలు కావడం ఖాయం అంటున్నాయి సర్వే సంస్థలు.
వైసీపీకి చెందిన మరో మంత్రి అంబటి రాంబాబు ఈ సారి సత్తెనపల్లిలో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి కన్నా లక్ష్మీ నారాయణ చేతిలో ఓటమి పాలు కావడం ఖాయం అంటున్నారు. గత ఎన్నికల్లో ఈయన కోడెల శివ ప్రసాద్ ను ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలవడంతో ఆ నియోజకవర్గంలో సమీకరణాలు మారాయి. దీంతో ఈ సారి అంబటి ఎమ్మెల్యేగా గెలవకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి.వైయస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఈ సారి గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పరాభవం తప్పదని సర్వేలు చెబుతున్నాయి.మరి మెజారిటీ సర్వేలు చెబుతున్నట్టు వీళ్లకు ఈ ఎన్నికల్లో గెలుపు అంతా ఈజీ కాదనే భావన వ్యక్తం అవుతోంది. మొత్తంగా ఈ సర్వేలు చెబుతున్నవి నిజం అవుతాయా లేదా అనేది తెలియాలంటే జూన్ 4న జరిగే కౌంటింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

మరి జగన్ క్యాబినెట్లో ప్రతిపక్ష నేతలు విసిరే సవాళ్లకు ధీటుగా సమాధానం చెప్పే మాస్ నేతలు చాలామందికి ఈ ఎన్నికల్లో ఓటమి అనేది ఖాయమని సర్వేలో తేలింది. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఇలాంటి మాస్ నేతలు లేని క్యాబినెట్లు చూడాల్సివస్తుంది. దాంతో జగన్ క్యాబినెట్ సప్పగా ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: