ఈ
పార్టీ అధినేత పవన్
కళ్యాణ్ రెండు
అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేస్తే రెండింటిలో కూడా ఓడిపోయాడు. ఈ
పార్టీ నుండి కేవలం ఒకే వ్యక్తి గెలుపొందారు. ఇకపోతే 2024 వ సంవత్సరం వ్యూహాత్మకంగా అడుగులు వేసి
టీడీపీ ,
బీజేపీ లతో జతకట్టి పోటీలోకి దిగారు. అందులో భాగంగా జనసెనా చాలా తక్కువ సీట్లనే తీసుకుంది. అలాగే పవన్ కూడా పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీలోకి దిగారు. ఇప్పటికే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ విడుదల అయ్యాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారం దాదాపు అందరూ పవన్
కళ్యాణ్ "పిఠాపురం" నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలుపొందనున్నట్లు ప్రకటించారు.
అలాగే ఆ ప్రాంత వాసులు కూడా పవన్
కళ్యాణ్ గెలుపు ఈ సారి కన్ఫామ్ అని చెబుతూ వస్తున్నారు. ఇక పవన్ బయట
జగన్ ను ఏ స్థాయిలో ఆడుకుంటాడో మన అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి
అసెంబ్లీ లోకి అడుగుపెడితే
జగన్ కి చుక్కలు కనిపించడం ఖాయం అని , అలాగే
జగన్ తో పాటు మరికొంతమంది
వైసిపి నేతలను కూడా పవన్ ఆడుకుంటాడు అని
జనసేన నేతలు , కార్యకర్తలు , అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి పవన్ అసెంబ్లీలో తన మాటల దాడితో ప్రత్యర్థులకు ఏ విధంగా చుక్కలు చూపిస్తాడో చూడాలి.