ఎగ్జిట్ పోల్స్ : కాంగ్రెస్ రికార్డ్ ను బ్రేక్ చేయబోతున్న మోడీ మానియా..?

FARMANULLA SHAIK
దేశవ్యాప్తంగా  పలు రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తుది దశ ఎన్నికలు ముగిశాయి. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు  జరిగాయి. ఏప్రిల్ 19న మొదలైన ఈ ఎన్నికలు జూన్ 1న ముగిశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విడుదల అయినా ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది.అయితే వచ్చిన ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనేవి ఎంతవరకూ ప్రతిఫలింప చేస్తుంది అనేది పక్కన పెడితే ఎన్నికలు  జరిగిన దాదాపు పక్షం రోజుల తరువాత వెలుగులోకి వచ్చిన అంచనాలు ప్రజల్ని కాస్త ఊపిరి తీసుకునేలా చేస్తున్నాయి.  లోక్ సభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతోన్నదని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఛరిష్మా మరోసారి బీజేపీని అధికార పీఠంపై కుర్చోపెట్టనుంది.ఈసారి కూడా కేంద్రంలో ఎన్‌డీఏ సర్కార్ రాబోతుందంటూ చాలా సర్వేలు వెల్లడించాయి.

ఎన్‌డీఏకు 330-400 వరకూ సీట్లు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ ఇండియా కూటమి 140-150 లోపే పరిమితమవుతుందని అంచనా వేస్తు్న్నాయి. ముఖ్యంగా ఎన్‌డీఏకు 400 పైగా సీట్లు వస్తాయని రెండు సంస్థలు ఇండియా టీవీ – CNX, న్యూస్ 24 – టుడేస్ చాణక్య చెబుతున్నాయి. దేశంలో ఇప్పటివరకూ 1984లో మాత్రమే కాంగ్రెస్‌కు సొంతంగా 404 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత మరే పార్టీకి సాధ్యం కాని 400 మార్క్ ఈసారి మోడీ హయాంలో రాబోతున్నయని బలంగా నమ్ముతున్నాయి. వీటితోపాటు చాలా సర్వేలు కేంద్రంలో మరోసారి ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నాయి. పోల్‌ ఆఫ్ ది పోల్‌లో ఎన్డీఏ కూటమికి 369 వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. పోల్‌ ఆఫ్ ది పోల్‌లో ఇండియా కూటమికి 157 రావొచ్చని పేర్కొంది.ఈసారి ఎగ్జిట్ పోల్స్ అన్నీ దేశంలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా తేల్చేశాయి. అంతే కాదు ఇండియా కూటమికి అంతా కూడబలుక్కుని ఇచ్చినట్లుగా 150 ఎంపీ సీట్లనే ఇచ్చాయి. దాంతో మరోసారి అంగరంగ వైభవంగా దేశంలో మోడీ పాలన వస్తుందని తేల్చేశాయి.మరో వైపు ఇండియా కూటమి ఈ విషయాన్ని ముందే పసిగట్టినట్లుగా ఎగ్జిట్ పోల్స్ మీద టీవీ డిబేట్లకు తాము రాము అని చెప్పేసింది. మరి ఇండియా కూటమికి ఎగ్జిట్ పోల్ సర్వేల మీద ఏ రకమైన అంచనాలు ఉన్నాయో తెలియదు. కానీ తామే అధికారంలోకి వస్తామని అది ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్ తో అంటే జూన్ 4న తేలుతుందని అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: