లోకేష్ మంగళగిరిలో గెలిచినట్లయితే ఆ విషయంలో అతని మెచ్చుకోవాల్సిందే..!

Pulgam Srinivas
ఎవరైనా పార్టీలో అద్భుతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతం నుండి పోటీ చేసినట్లు అయితే అతను ఆ ప్రాంతంలో ఓడిపోతే మళ్ళీ ఆ ప్రాంతం వైపు తిరిగి చూడకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పోటీ చేస్తే ఓట్లు బాగా వస్తాయి , కచ్చితంగా గెలిచే అవకాశాలు ఇక్కడే ఉన్నాయి అని ఆచితూచి మరో స్థానం నుండి పోటీ చేసే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కానీ టిడిపి పార్టీలో అత్యంత కీలక వ్యక్తులలో ఒకరు అయినటువంటి నారా లోకేష్ మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకం.

ఎందుకు అంటే ఈయన 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ నుండి మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా లోకేష్ పోటీలోకి దిగారు. ఈయన గెలుపు అంతా కన్ఫామ్ అనుకున్నారు. కానీ ఫలితాలు మాత్రం అలా రాలేదు. మంగళగిరి స్థానం నుండి మొట్ట మొదటి సారి బరిలోకి దిగిన లోకేష్ కు గట్టి షాక్ తగిలింది. ఆ ప్రాంతంలో ఆయన ఓడిపోయాడు. దానితో ఆయన ఇక పై ఈ ప్రాంతం వైపు తిరిగి చూడడు అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఆయన మాత్రం అలా చేయలేదు. 2019 నుండి 2024 వరకు ఇక్కడి ప్రాంత ప్రజల అవసరాలను మరియు వారికి ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలపై ఆరా తీసి ఎన్నో పనులు చేశారు. ఇక ఎలక్షన్ ల సమయంలో కూడా వేరే ఏ ప్రాంతాలను పట్టించుకోకుండా ఈ ఒక్క ప్రాంతంపై దృష్టి పెట్టాడు. దానితో ఈయన ఈ సారి మంగళగిరి లో భారీ మెజార్టీ తో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అంటున్నారు. ఒక వేళ నిజం గానే ఈయన మంగళగిరి నుండి గెలిచినట్లు అయితే ఈయన దృఢ సంకల్పానికి మెచ్చుకోవాల్సిందే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి మంగళగిరి స్థానం నుండి ఈ సారి లోకేష్ గెలుస్తారా ..? లేదా అనేది జూన్ 4 వ తేదీన తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nl

సంబంధిత వార్తలు: