తెలంగాణ : కాంగ్రెస్ గెలుపు కన్ఫామ్ అనుకున్న ప్రాంతాలను బీజేపీ కబ్జా చేయనుందా..?

Pulgam Srinivas
తెలంగాణ రాష్ట్రంలో పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిలో ఎవరు ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అన్ని అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ కి వచ్చాయి. దానితో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఇకపోతే ఎంతో మంది సీనియర్ లీడర్లు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఎలక్షన్ ల ముందు ఎంతో క్రియాశీలకంగా పని చేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా అనేక ప్రణాళికలను రూపొందించిన రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి గా నియమించింది.

ఇకపోతే మే 13 వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగి వాటిలో మంచి జోష్ చూపిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అదే స్థాయి జోష్ ను చూపించి భారీ ఎంపి స్థానాలను కొల్లగొట్టాలి అని అనేక ప్రణాళికలను వేసింది. అందులో భాగంగా ఏ ప్రాంతంలో ఎవరికి సీట్ ఇవ్వాలి. ఎవరికి సీట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని ఆచితూచి ఎన్నో ప్రణాళికలను రచించి అభ్యర్థులను ఎంపిక చేసింది.

ఇకపోతే మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తోనే పోటీ అని అనుకుంది. కాకపోతే అనూహ్యంగా బిఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ బిజెపి తో తెలంగాణ లో ఎక్కువ పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బలహీనంగా ఉన్న ప్రాంతాలలో కాంగ్రెస్ ఈజీగా గెలుపొందుతుంది అని భావించినప్పటికీ బిఆర్ఎస్ పార్టీ వీక్ గా ఉన్న ప్రతి ప్రదేశం లోనూ దాదాపుగా బిజెపి పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు , దానితో కాంగ్రెస్ కి దాదాపుగా కన్ఫామ్ అనుకున్న కొన్ని సీట్లు బిజెపి కి వెళ్లే అవకాశం ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: