వ్రాప్ రిపోర్ట్ : జగన్ చెప్పింది నిజం కానుందా..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే ఎన్నికలు ముగిసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక 2024 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో వైసిపి పార్టీ ఒంటరిగా పోటీలోకి దిగగా , టిడిపి , జనసేన , బిజెపి పార్టీలు పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో 2019 సంవత్సరం కంటే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది.

దీనితో ఇది వైసిపి పార్టీకి కలిసి వచ్చే అంశం కాదు అని , కూటమికి కలిసి వచ్చే అంశం అని చాలా మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక అలా అభిప్రాయాలు రావడంతో వైసిపి వర్గం ప్రజలు నిరుత్సాహ పడ్డారు. అలాంటి సమయం లోనే జగన్ ఓ ఈవెంట్ లో భాగంగా మాట్లాడుతూ ... మళ్ళీ మేమే అధికారం లోకి రాబోతున్నాము. 2019 లో మాకు 150 అసెంబ్లీ స్థానాలు వస్తాయి అంటే ఎవరు నమ్మలేదు.

కానీ ఆ ఎన్నికల్లో మాకు 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఇకపోతే ఈ సారి మాకు అంతకంటే ఎక్కువ అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలు రాబోతున్నాయి అని చెప్పారు. దానితో వైసిపి వర్గాల్లో ఆనందం నెలకొంటే , కూటమి వర్గాల్లో టెన్షన్ నెలకొంది. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు జూన్ 4 వ తేదీన విడుదల కానున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా దేశంలోని అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై చేసిన ఎగ్జిట్ పోల్స్ రిపోర్టు ను తాజాగా విడుదల చేశాయి. అందులో భాగంగా వ్రాప్ సంస్థ కూడా తన నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం వైసీపీ పార్టీకి 158 అసెంబ్లీ స్థానాలు రానున్నట్లు , కూటమికి కేవలం 4 నుంచి 17 స్థానాలు మాత్రమే రానున్నట్లు ఈ సంస్థ తన నివేదికలో పేర్కొంది.

ఇక ఇదే కానీ నిజం అయితే వైసిపి పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్ లో బాగంగా 151 సీట్ల కంటే ఎక్కువ వస్తాయి అని చెప్పాడు ఆ మాటే నిజం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: