జ‌న‌సేన గెలిచే సీట్లు... ప‌వ‌న్ మెజార్టీ లెక్క‌లివే..?

Pulgam Srinivas
ఏ రాష్ట్రంలో అయినా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది అంటే చాలు అనేక సర్వే సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది సిబ్బందిని పెట్టుకొని సర్వేలను నిర్వహిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎవరు పోటీలో ఉన్నారు. ఎవరి బలాలు ఏమిటి ..? ఎవరి బలహీనతలు ఏమిటి ..? ఎవరి సైడు ఏ ఓట్లు పడనున్నాయి ..? మొత్తంగా ఎవరూ గెలవరున్నారు ..? గెలిస్తే ఎంత శాతం మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది ..? ఇలా అనేక లెక్కలను వేస్తూ ఎవరు గెలుస్తారు అనే దానిపై ఒక అంచనాకు వచ్చి ఒక రిపోర్టు ను విడుదల చేస్తూ ఉంటారు.

ఇక కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫలితాలు జూన్ 4 వ తేదీన విడుదల కానున్నాయి. ఇకపోతే ఎన్నికల ఫలితాలకు ముందు ఎగ్జిట్ పోల్స్ ను అనేక సంస్థలు విడుదల చేస్తాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. అందులో ఇప్పటికే ఎన్నో ఎన్నికలలో సర్వేలను నిర్వహించి వాటి ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సంస్థలలో ఆరా మస్తాన్ సంస్థ ఒకటి. ఇకపోతే ఈ సంస్థ వారు కూడా తాజాగా తమ సర్వే సంస్థ రిపోర్టును విడుదల చేశారు.

ఆ సంస్థ రిపోర్ట్ ప్రకారం జనసేన పార్టీ కి ఎన్ని లోక్సభ స్థానాలు రానున్నాయి. పవన్ కళ్యాణ్ కు ఎంత శాతం మెజారిటీ రానుంది అనే విషయంపై ఆరా మస్తాన్ సమాధానం ఇచ్చారు. ఈయన తాజాగా మాట్లాడుతూ ... జనసేన పార్టీ రెండు పార్లమెంట్ స్థానాలలో పోటీ చేయగా , రెండింటిలో కూడా గెలిచే అవకాశం ఉంది అని , అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం నుండి పోటీ చేశారు. ఈయన గెలవడం ఖాయం అని మెజార్టీ కూడా భారీ మొత్తంలో రానుంది అని ఈయన అంచనా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: