పీపుల్స్ పల్స్ రిపోర్ట్ : ఏకంగా టీడీపీ కి అన్నీ సీట్లు..!

Pulgam Srinivas
మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఎన్నికలు జరగడానికి ముందే ఎన్నో సంస్థలు ఎన్నో నివేదికలను విడుదల చేశాయి. ఇక ఎన్నికల తర్వాత కూడా దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో ఎలక్షన్ ల రిజల్ట్ వచ్చే కంటే కొంత కాలం ముందు ఏ పార్టీ కి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది.

ఎవరు అధికారంలోకి వస్తారు. అనే విషయాలను తెలియజేస్తూ రిపోర్ట్ ను విడుదల చేస్తూ ఉంటారు. అందులో భాగంగా పీపుల్స్ పల్స్ అనే సంస్థ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలోని ప్రతి రాష్ట్రంలో ఎలక్షన్ల తర్వాత ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయంపై పూర్తి స్థాయిలో సర్వేను నిర్వహించే రిపోర్టులను విడుదల చేస్తూ ఉంటుంది.

అందులో భాగంగా తాజాగా ఈ సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు. ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే విషయం గురించి ఓ నివేదికను రెడీ చేసి దానిని తాజాగా విడుదల చేసింది. తాజాగా ఈ సంస్థ వారు మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగగా వాటిలో టిడిపి పార్టీకి 95 నుండి 110 సీట్ల వరకు వస్తాయి అని అంచనా వేసింది. ఒక వేళ నిజం గానే ఈ సంస్థ రిపోర్ట్ ప్రకారం టి డి పి కి అన్ని సీట్లు కనుక వచ్చినట్లు అయితే ఈ పార్టీ సొంత గానే అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: