కేకే సర్వే : విశాఖలో జనసేన విజృంభన..!

Pulgam Srinivas
పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరం జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈయన ఈ పార్టీని స్థాపించిన తర్వాత , ఎన్నికల కు మధ్య చాలా తక్కువ సమయం ఉండడంతో ఈయన 2014 వ సంవత్సరం ఎన్నికలలోకి దిగలేదు. 2019 వ సంవత్సరం జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతట అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టింది.

కాకపోతే ఈ పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుండి పోటీ చేస్తే రెండింటిలోనూ ఓడిపోయాడు. కేవలం ఈ పార్టీ నుండి ఒకే ఒక సభ్యుడు గెలుపొంది , అసెంబ్లీ లోకి వెళ్ళాడు. దానితో ఆలోచనలో పడిపోయిన పవన్ కళ్యాణ్ ఈ సారి ఎలాగైనా భారీ స్థానాలను గెలుపొందాలని తెలుగు దేశం , బిజెపి పార్టీలతో జతకట్టాడు. ఇక అప్పటికే పవన్ చాలా ప్రచారాలను చేసి ఉండడం , టీడీపీ , బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో ఈయన మైలేజ్ అదిరిపోయే రేంజ్ లో పెరిగింది.

పొత్తుల భాగంగా తక్కువ స్థానాలనే తీసుకున్న జనసేన అందులో కచ్చితంగా గెలుపొందాలి అని ఎంతో కృషి చేసింది. ఇకపోతే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఒక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోనే నాలుగు అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ఈ నాలుగు స్థానాలలో నాలుగు కూడా గెలుపొందాలి అని మొదటి నుండి జనసేన ప్రయత్నాలు చేసింది.

ఇకపోతే తాజాగా కేకే సర్వే ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. ఆయన సర్వే ప్రకారం జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుండి నాలుగు స్థానాలలో పోటీ చేస్తే ఆ నాలుగు స్థానాలలో కూడా గెలవబోతోంది , గెలవడం మాత్రమే కాకుండా ప్రతి స్థానం నుండి కూడా బారి మెజారిటీ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు. ఇదే కానీ జరిగితే 2019 నుండి 2024 కు జనసేన మైలేజ్ విపరీతంగా పెరిగినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: