రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తున్న డీకే అరుణ ?

Veldandi Saikiran
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు అయినా ఏపీ అలాగే తెలంగాణలో... మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. దీంతో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అటు జూన్ 4వ తేదీన... ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. చుక్కలు చూపిస్తున్నారు డీకే అరుణ.


 మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డీకే అరుణ కీలక నేతలు. వీరిద్దరూ ఈ జిల్లాకు చెందిన వారే. అయితే ఈసారి మహబూబ్నగర్ ఎంపీగా... బిజెపి పార్టీ తరఫున డీకే అరుణ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అటు గులాబీ పార్టీ తరఫున  మన్నె శ్రీనివాస్ రెడ్డి  సెట్టింగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వంశీధర్ రెడ్డి బరిలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో... కచ్చితంగా ఇక్కడ ఎంపీ సీటు గెలవాలి.

 
 అంతేకాకుండా... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్. ఇలాంటి నేపథ్యంలో మహబూబ్నగర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే. లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి పరువు మొత్తం పోతుంది. ఈ ఎన్నిక రేవంత్ రెడ్డికి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే దీనికోసమే...  పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి... ఇప్పటివరకు  మహబూబ్నగర్  జిల్లాలో ఆరుసార్లకు పైగా  పర్యటించారు రేవంత్ రెడ్డి.

 
 విచ్చలవిడిగా ఖర్చు కూడా చేశారట రేవంత్. అక్కడ అధికారులను కూడా బాగా వాడేస్తున్నారట. ఎలాగైనా గెలవాలని నేతలందరికీ దిశా నిర్దేశం చేశారట రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే మహిళా అని చూడకుండా డీకే అరుణ పై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు రేవంత్ రెడ్డి. అదే స్థాయిలో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేలా... డీకే అరుణ కూడా చాలా కష్టపడ్డారు. గ్రౌండ్ స్థాయిలో కూడా బిజెపికి చాలామంది ఓటు వేసినట్లు సమాచారం. ఈ లెక్కన.. మహబూబ్నగర్లో  బిజెపి గెలుస్తుందని సమాచారం. దీంతో రేవంత్ రెడ్డి బాగా టెన్షన్ పడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: