కేసీఆర్ తిరుగుబాటు షురూ... ఇక తగ్గేదెలే ?

Veldandi Saikiran
మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ చేతిలో ఓడింది గులాబీ పార్టీ. దీంతో ఆ ఎన్నికల్లో 39 స్థానాలు దక్కించుకున్న కేసీఆర్ పార్టీ...ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఇక 39 ఎమ్మెల్యేలలో..ఒకరు మరణించగా..మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇలా పార్టీ నుంచి ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు.
 ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీ ఎక్కువ సీట్లు గెలవకపోతే... చాలామంది లీడర్లు జంప్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసు కేసీఆర్ మెడకు చుట్టుకుంటుంది. మే 28వ తేదీన  కవిత లిక్కర్ కేసు విచారణలో... కెసిఆర్ పేరు వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తను...  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తప్పుగా ప్రచురించినట్లు గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తండ్రి డైరెక్షన్లో కూతురు  లిక్కర్ స్కామ్ చేసినట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసింది.
 ఇటు ఈనాడు తో పాటు మరో పదహారు చానల్ ఇలాగే ప్రసారం చేశాయని... టిఆర్ఎస్ ఆరోపిస్తూ... కేసులు పెట్టింది. వాస్తవానికి మే 28వ తేదీన జరిగిన కోర్టు విచారణలో... మాగుంట  గురించి ప్రస్తావన వస్తే.. కెసిఆర్ ప్రస్తావన వచ్చినట్లు ఈ ఛానల్ వార్తలు ప్రసారం చేశాడట. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అయితే ఎడిటోరియల్ పేజీలో కూడా రాసిందని సమాచారం. దీంతో సీరియస్ అయిన గులాబీ పార్టీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 ఏబీఎన్, ఈనాడుతో పాటు మరో పదహారు యూట్యూబ్ ఛానల్ లకు  హెచ్చరికలు జారీ చేస్తూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది గులాబీ పార్టీ. అయితే... కెసిఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు రామోజీరావు.... గులాబీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. అదే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి... కాస్త భయపడి కెసిఆర్ కు అప్పట్లో వార్తలు రాశారు. కానీ ఎప్పుడైతే ఆయన అధికారంలోంచి దిగిపోయారో...  అప్పటినుంచి కెసిఆర్ కు వ్యతిరేకంగానే ఈ చానల్లలో వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి అని బీఆర్ఎస్ ఆరోపణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: