కౌంటింగ్ ఎఫెక్ట్ : ప్రేక్షకులకు పిలుపునిచ్చిన సినిమా థియేటర్స్..!

FARMANULLA SHAIK
జూన్‌ 4వ తేదీనాటి ప్రజాతీర్పు కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం వెలువడబోయే ఎగ్జిట్‌ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చా నడుస్తోంది.దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్‌ శనివారం జరుగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌తో పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌ జరగనుంది.ఇక అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే ఉంది.
జూన్ 4న ఓట్ల లెక్కింపుపై అందరి దృష్టి ఉంది. ఈ క్రమంలో జూన్‌ 1న సాయంత్రం పలు న్యూస్ చానెళ్లు కూడా ఎగ్జిట్ పోల్స్ పేరుతో గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఈ తతంగం ముగిసిన తర్వాత జూన్‌ 4న ఫలితాలు కోసం యావత్‌ దేశం టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతుంది. అయితే, ఎన్నికల ఫలితాలు లైవ్‌లోనే బిగ్‌ స్క్రీన్‌పై ప్రసారమైతే..? ఆ అనుభూతి ఎలా ఉంటుంది..? ఇప్పుడు మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఈ ప్లాన్‌నే అమలు చేయబోతున్నాయి.
ముంబైలో ఎస్ఎం 5 కళ్యాణ్, సియాన్,నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్‌ ఎటర్నిటీ, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్‌, థానేలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్,పుణెలోని మూవీమ్యాక్స్‌, మీరా రోడ్ ప్రాంతంలోని మూవీమాక్స్ చైన్ ఆఫ్ థియేటర్లు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రదర్శిస్తాయి. ఇందుకోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు కూడా జరిగిపోయాయి. ఉదయం 9గంటల నుంచి ఆ థియేటర్‌లలోకి అనుమతిస్తారు. సుమారు 6గంటల పాటు థియేటర్‌లో ఎన్నికల ఫలితాలను ప్రదర్శిస్తారు. టికెట్‌ ధర రూ. 99 నుంచి రూ. 300 వరకు ఉంటుంది. బిగ్‌ స్క్రీన్‌పై ఎన్నికల ఫలితాలు చూడాలని ఆశించేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో చాలా థియేటర్‌లు హౌస్‌ఫుల్‌ అయిపోయాయి. కాహే తెరిస్తే ఇంత రసవత్తరంగా సాగుతున్న ఈ పోరులో గెలిచేది ఎవరో వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: