ఏపీ రాజకీయాలు- బ‌క‌రాలు - బ‌లిప‌శువులు: అంబటి కథ సమాప్తం?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో అందరూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో... ఏపీలోని చాలా మంది రాజకీయ నేతలు బలి పశువులు అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాము నిల్చున్న చోట ఓడిపోతామని తెలిసికూడా... కొంతమంది రాజకీయ నేతలు టికెట్లు తీసుకున్నారు. ఫలానా రాజకీయ నాయకుడు ఫలానా నియోజకవర్గంలో ఓడిపోతాడని తెలిసి కూడా వైసిపి ఇటు, తెలుగుదేశం పార్టీ అధినేతలు టికెట్ ఇచ్చేశారు.

ఓడిపోయే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి సాహసమే చేశారు. అభ్యర్థులను మాత్రం బలి పశువులను చేశారని అంటున్నారు. అలాంటి వారిలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఒకరు. అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి  ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2014 సంవత్సరంలో ఓడిపోయిన అంబటి రాంబాబు... 2019 ఎన్నికల్లో మాత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2014 సంవత్సరంలో కోడెల శివప్రసాద్ చేతిలో ఓడిపోయి... 2019లో రివేంజ్ తీర్చుకున్నారు అంబటి రాంబాబు.

అయితే ఈసారి మాత్రం అంబటి రాంబాబుకు...  నియోజకవర్గంలో అంత ఈజీగా విజయం దక్కేలా కనిపించడం లేదట. దానికి కారణం కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి  కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉండటం. కన్నా లక్ష్మీనారాయణ అలాగే అంబటి రాంబాబు ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులే. ఈ ఇద్దరు ఏపీలో కీలక నేతలే.  ఇద్దరిలో ఎవరు గెలిచినా మంత్రి పదవి దక్కించుకునే నాయకులే.

కానీ ఈసారి అంబటి రాంబాబు గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. కానీ వేరే గత్యంతరం లేక అంబటి రాంబాబుకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు  తెగ వైరల్ అవుతున్నాయి. గ్రౌండ్ స్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో అంబటి రాంబాబు విఫలమయ్యారట. అసలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా... అంబటి రాంబాబు నిర్లక్ష్యం చేశారట. అలాగే వైసిపి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఏపీలో మొదలైంది. ఇటు కన్నా లక్ష్మీనారాయణ లాంటి పెద్ద లీడర్ బరిలో ఉండటం... అంబటి రాంబాబు ఓటమి ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: