హైదరాబాద్ కు బై బై: ఏపీ సెటిలర్లను.. రేవంత్ కడుపున పెట్టుకుంటారా?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు... హైదరాబాద్ మహానగరానికి బంధం తెగిపోయింది. జూన్ రెండవ తేదీ నుంచి... దాదాపు 50 సంవత్సరాల హైదరాబాద్ మహానగరం తో ఉన్న సంబంధానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు దూరం కాబోతున్నారు. 2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీమాంధ్రకు రాజధాని లేదని... హైదరాబాద్ మహానగరాన్ని 10 సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

అయితే... జూన్ రెండవ తేదీకి పది సంవత్సరాలు పూర్తి అవుతాయ్. హైదరాబాద్ తో ఆంధ్రప్రదేశ్ సంబంధం తెగిపోయింది. ఇకనుంచి హైదరాబాద్  నగరంలో ఉండే ఆంధ్ర ప్రజలు నాన్ లోకల్ కిందికి వస్తారు. నా అనుకున్న హైదరాబాద్ నగరం... ఇక పరాయి వారిది కాబోతుంది. 10 సంవత్సరాలు దాటినప్పటికీ ఆంధ్రప్రదేశ్కు మాత్రం రాజధాని ఏర్పాటు కాలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి అనుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అనేశారు.

కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు అసలు రాజధాని ఏమిటో  ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇదంతా పక్కకు పెడితే...  హైదరాబాద్ తో ఏపీ ప్రజలు తెగ దెంపులు చేసుకున్న తర్వాత... తెలంగాణ రాష్ట్రంలో సెటిల్ అయిన  ఏపీ ప్రజల పరిస్థితి ఏంటి అని అంటున్నారు. వారికి తెలంగాణ రాష్ట్రంలో సేఫ్టీ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. అయితే...  గత పది సంవత్సరాల గులాబీ పార్టీ పాలనలో... సెటిలర్లు చాలా సంతోషంగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి,  అక్కడి ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయించడంలో కేసీఆర్ పాత్ర ముఖ్యం. ఆయన కీలకం. అలాంటి వ్యక్తిని... 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో, జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిపించింది సెటిలర్స్ మాత్రమే. 2023 లో హైదరాబాదులో గులాబీ పార్టీకి  ఎక్కువ సీట్లు రావడానికి కూడా ఏపీ సెటిలర్లే   కారణం. ఎందుకంటే గత పది సంవత్సరాల లో హైదరాబాదులో ఉన్న ఏపీ సెటిలర్లను... కడుపులో పెట్టుకొని చూసుకున్నారు కేసీఆర్.

తెలంగాణ ఉద్యమంలో ఏపీ ప్రజలను తిట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అదే జరగడం ఖాయం. రేవంత్ రెడ్డి ఇప్పటికే చంద్రబాబుకు సన్నిహితులుగా ఉన్నారు. ఆయనకు ఏపీ ప్రజలు అంటే చాలా గౌరవం. కాబట్టి రేవంత్ రెడ్డి పాలనలో కూడా... ఏపీ సెటిలర్లకు  మంచి సేఫ్టీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: