విశాఖ టీడీపీ మాజీ మంత్రుల పరిస్థితి ఇదే..!

Pulgam Srinivas
ఏ పార్టీలో అయినా మంత్రి పదవులను పొందారు అంటే వారు ఆ పార్టీలో ఎంతో కీలకమైన వ్యక్తులు అయి ఉండాలి. ఆ పార్టీలో ఎంతో కీలకమైన వ్యక్తులు అయి ఉండి , పార్టీ కోసం ఎంతో పాటు పడిన వారికే దాదాపుగా పార్టీలు మంత్రి పదవులను కట్టబెడుతూ ఉంటాయి. ఇక అందులో భాగంగా తెలుగు దేశం పార్టీ కూడా తమ పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పని చేస్తూ , పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పటుపడిన కొంత మందికి తమ హయాంలో మంత్రి పదవులను ఇచ్చింది.

టిడిపి పార్టీలో మంత్రి పదవులుగా చేసిన ముగ్గురు ఈ సారి విశాఖ నుండి పోటీ పడుతున్నారు. మరి వారి పరిస్థితిలో ఎలా ఉన్నాయి..? ఈ ఎన్నికల్లో వారు గట్టెకుతారా..? లేదే అనేది చూడాలి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా భీముని పట్నం నుండి గంటా శ్రీనివాసరావు ఈ సారి టిడిపి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇకపోతే ఈయనకు ఈ సారి ఈ ప్రాంతం నుండి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాంతం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ఈయన ఈ సారి గట్టి ఫైట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దానితో గంటా శ్రీనివాసరావు కి విజయం అంత ఈజీ కాదు అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. మరో టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఈ సారి నర్సీపట్నం నుండి బరిలోకి దిగారు. ఇక ఈ నియోజకవర్గము నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పేట్ల ఉమా శంకర్ బరిలో నిలిచారు. పోయిన సారి కూడా ఇదే ప్రాంతం నుండి గెలిచి ప్రస్తుతం ఈయన ఈ ప్రాంతంలో సెట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఇక ఈయన నుండి కూడా అయ్యన్నపాత్రుని కి గట్టి పోటీ ఉండబోతున్నట్లు చివరి నిమిషం వరకు గెలుపు ఎవరిది అని చెప్పడం కష్టమే అని తెలుస్తుంది. ఇక బండారు సత్యనారాయణమూర్తి చివరి నిమిషంలో ముడుగులకు షిఫ్ట్ అయ్యారు. ఇక ఈ ప్రాంతం నుండి ఉప ముఖ్యమంత్రి కూతురు అయినటువంటి ఈర్ల అనురాధ ఈ ప్రాంతం నుండి మొదటి ప్రయత్నం లోనే గెలిచే అవకాశం ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇలా టిడిపి మాజీ మంత్రులకు ఈ సారి విశాఖ జిల్లాలో గట్టి పోటీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: