జగన్ స్పీచ్ ఎఫెక్ట్... ఇప్పటికీ కన్ఫ్యూజన్ లో కూటమి..?

Pulgam Srinivas
దాదాపు రెండు మూడు నెలల హోరా హోరీ ప్రచారాల తర్వాత మే 13 వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇక ఎన్నికలలో పోయిన సారి కంటే ఈ సారి కనుక ఎక్కువ శాతం ఓటింగ్ జరిగినట్లు అయితే అది ప్రస్తుత అధికార పార్టీకి వ్యతిరేకం గాను , అది కూటమికి కలిసి వచ్చే అంశం గారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇకపోతే ఈ సారి ఎన్నికలలో పోయిన సారి కంటే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.

దానితో అది కూటమి కి పాజిటివ్ అంశముగా చాలా మంది మాట్లాడుకుంటూ వచ్చారు. దానితో వైసిపి నేతలు , కార్యకర్తలు , ఆ పార్టీని అభిమానించే అభిమానులు అంతా కూడా ఒక్క సారిగా డల్ అయిపోయారు. ఇలా వైసీపీ శ్రేణులంతా డల్ గా ఉన్న సమయంలో వైసీపీ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు.

అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ పోయిన సారి మాకు 150 సీట్లు వస్తాయి అంటే ఎవరూ నమ్మలేదు. కానీ మాకు ఏకంగా 151 సీట్లు వచ్చాయి. ఇక ఈ సారి మేము అంతకంటే ఎక్కువ స్థానాలలో గెలవబోతున్నాం. అలాగే పోయిన సారి మాకు వచ్చిన పార్లమెంట్ స్థానాలు కంటే ఈ సారి ఎక్కువ వస్తాయి. ప్రజలు మమ్మల్ని ఎంతో నమ్మారు. మళ్లీ మా ప్రభుత్వమే రాబోతుంది అని జగన్ చెప్పాడు.

ఇలా ఓటింగ్ శాతం ఎక్కువ జరిగింది అది కూటమికి అనుకూలం అని అనేక మంది అంటూ ఉంటే అలాంటి సమయంలో జగన్ మేము అధికారంలోకి రాబోతున్నాం అని ప్రకటించడంతో జగన్ వర్గం సంతోషంలో మునిగిపోతే , కూటమి వర్గం మాత్రం డిలా పడిపోయింది.

ఇక ఒకటి , రెండు రోజుల్లో ఈ విషయాన్ని కూటమి వర్గం మర్చిపోతుంది అనుకున్నారు. కానీ రిజల్ట్ దగ్గరికి వచ్చిన కూడా జగన్ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు రిజల్ట్ ఎలా రాబోతుందా అని కూటమి నేతలు కార్యకర్తల్లో మరియు ఆ పార్టీ లను అభిమానించే వ్యక్తులలో కూడా కాస్త టెన్షన్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: