తెలుగుదేశం... జనసేనతో పొత్తు బీజేపీ కి భారీ స్థాయిలో కలిసి రానుందా..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వై సీ పీ పార్టీ ఒంటరిగానే పోటీలోకి దిగడానికి ఎప్పటి నుండో సిద్ధం అయ్యింది. ఇక తెలుగు దేశం పార్టీ మాత్రం ఒంటరిగా పోటీ చేయడం కంటే కూడా రాష్ట్రంలో మరో గట్టి పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగినట్లు అయితే తమకు బలం చేకూరుతుంది , అలాగే ఓట్లు కూడా చిలే అవకాశం ఉండదు అని చాలా రోజుల క్రితమే జనసేన పార్టీని కూడా కలుపుకొని పోటీలోకి దిగడానికి రెడీ అయినట్లు సంకేతాలు కూడా ఇచ్చేసింది.

కూడా టి డి పి , జనసేన తో బీ జే పీ కూడా పొత్తు కట్టబోతుంది అని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోవడంతో బి జె పి ఒంటరి గానే పోటీలోకి దిగుతుంది అని కొంత మంది భావించారు. కానీ చివరి నిమిషంలో టిడిపి , జనసేన తో పాటు బిజెపి కూడా పొత్తులో భాగం అయ్యాయి. ఇలా ఈ మూడు పార్టీలు కలిపి కూటమిగా బరిలోకి దిగాయి. 2019 ఎన్నికలలో బి జె పి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. ఈ సారి తెలుగు దేశం , జనసేన తో కలిసి పోటీ చేయడంతో ఈ పార్టీ క్రేజ్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో భారీగా పెరిగింది.

తెలుగు దేశం , జనసేన పార్టీలకు ఈ ప్రాంతంలో భారీ క్రేజ్ ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీలతో పోలిస్తే బి జె పి కి కాస్త తక్కువే ఉంది. కానీ ఈ సారి ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో బిజెపి కి చాలా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది భావిస్తున్నారు. కొన్ని సర్వేలు ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి 18 ఎంపీ స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఒక వేళ నిజంగానే 18 స్థానాలు కనుక వచ్చినట్లు అయితే అవి బిజెపి కి చాలా కలిసి వస్తే అంశంగాను ఈ స్థాయి స్థానాలు వచ్చినట్లు అయితే టి డి పి , తెలుగు దేశం కంటే కూడా ఈ పొత్తు బిజెపి కే చాలా కలిసి వచ్చినట్లుగా కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: