నీళ్ల కోసం దండం పెట్టి అడిగిన కేజ్రివాల్..!

Pulgam Srinivas
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన రాష్ట్రం కోసం దండం పెట్టి మరి ఇరుగు పొరుగు రాష్ట్రాలను నీటి కోసం అడుగుతున్నారు. అసలు ఢిల్లీలో అంత తీవ్రమైన నీటి కొరత ఎందుకు ఏర్పడింది.  కేజ్రీవాల్ ఏ రాష్ట్రాలను నీటి కోసం దండం పెట్టి మరి అడుగుతున్నారు అనే వివరాలను తెలుసుకుందాం. ఇది వేసవి కాలం అన్న విషయం మనకు తెలిసిందే. ఈ కాలంలో దాదాపుగా దేశం లోని ఏ ప్రాంతంలో అయినా తీవ్రమైన ఎండలు ఉంటాయి.

వాటి వల్ల భూగర్భ జలాలు భారీ గా తగ్గిపోతాయి. ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఈ ప్రాంతంలో ఈ నెలలో భారీ ఎండలు ఉంటాయి. వాటి వల్ల భూగర్భ జలాలు చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే ఈ ప్రాంతంలో జనాలు కూడా భారీగా ఉండడంతో వారందరికీ నీటి అవసరం చాలా పెరుగుతుంది. దాని ద్వారా ఈ ప్రాంతంలో ఈ నెల వచ్చింది అంటే చలు నీటి కొరత చాలా పెరుగుతూ ఉంటుంది. ఇలాగే ఈ సారి కూడా ఢిల్లీలో ప్రస్తుతం నీటి కొరత భారీగా ఉంది. దీనితో ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ తాజాగా తన ఇరుగు పొరుగు రాష్ట్రాలను దండం పెట్టి మరి నీరు ఇవ్వమని వేడుకున్నాడు.

ఢిల్లీలో తీవ్ర నీటి కొరత ఏర్పడిందని , కేంద్రం , ఇరుగు పొరుగు బీజేపీ పాలిత రాష్ట్రాలు నీటిని సరఫరా చేయాలి అని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. తీవ్ర ఉష్ణోగ్రతల వల్లే ఢిల్లీలో నీటికి డిమాండ్ పెరిగింది. హర్యానా , యూపీ నుంచి నీటి సరఫరా తగ్గింది. దీంతో డిమాండ్ పెరిగి సప్లై తగ్గింది. ఈ సమయంలో రాజకీయాలు చేయొద్దు అని దండం పెట్టి అడుగుతున్న అందరూ కలిసి ఢిల్లీ నీటి సమస్యను ఎదుర్కొందాం అని ఆయన కోరారు. ఇక తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: