రేపటితో లోక్సభ ఎలక్షన్స్ క్లోజ్... ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలకో తెలుసా..?

Pulgam Srinivas
లోక్ సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. రేపు చివరి విడత పోలింగ్ జరగనుంది. ఇకపోతే రేపు ఎనిమిది రాష్ట్రాలలో చివరి విడత ఓటింగ్ జరగబోతుంది. ఇందులో ఒక కేంద్ర పాలిత ప్రాంతం లోని మొత్తం 57 స్థానాలకు ఎలక్షన్ కమిషన్ పోలింగ్ నిర్వహించనుంది. ఉత్తర ప్రదేశ్ లోని 13 స్థానాలకు రేపు ఓటింగ్ జరగనుంది. అలాగే పంజాబ్ లోకి 12 స్థానాలకు కూడా రేపే ఓటింగ్ జరగబోతుంది. ఇక బీహార్ లోని 8 స్థానాలకు , బెంగాల్ లోని 9 స్థానాలకు , హిమాచల్ ప్రదేశ్ లోని 4 స్థానాలకు , ఒడిశా లోని 6 స్థానాలకు , జార్ఖండ్ లోని 3 స్థానాలకు చండీగఢ్ లోని ఒక స్థానానికి కలిపి రేపు ఓటింగ్ జరగబోతుంది.

ఇకపోతే మొత్తం రేపు ఆఖరి విడత పోలింగ్ 57 స్థానాలకు జరగనుండగా , ఈ 57 స్థానాల కోసం మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇకపోతే ఇందులో ప్రస్తుత దేశ ప్రధాన మంత్రి అయినటువంటి ప్రధాన మంత్రి మరియు సినీ నటి అయినటువంటి కంగనా రనోత్ కూడా ఉన్నారు. వీరిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే. ఇకపోతే ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఈ 57 పార్లమెంటు స్థానాలల్ ఎలాంటి ఘర్షణ సంఘటనలు జరగకుండా సజావుగా ఎలక్షన్ లను నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేసింది.

అలాగే ఏవైనా చెదురు మోదురు సంఘటనలు ఎదురైనా కూడా వాటిని ఎలాంటి గందర గోళం లేకుండా సాల్వ్ చేసే విధానాలను కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ విడత ఎలక్షన్ లు రేపటితో పూర్తి కానుండగా , జూన్ 4 వ తేదీన దేశ వ్యాప్తంగా జరిగిన అన్ని విడుదలకు సంబంధించిన లోక్ సభ ఎన్నికల రిజల్ట్ రాబోతుంది. ఇక జూన్ 4 వ తేదీ కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో అద్భుతంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈరోజుతో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో ..? ఏ పార్టీ దేశంలో అధికారం లోకి వస్తుందో తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: