పవన్‌ : పిఠాపురం వర్మకు చంద్రబాబు బంపర్‌ గిఫ్ట్‌ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ రోజుకు సమయం దగ్గర పడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఏపీలో ఎవరు గెలుస్తారనే దానిపై అందరూ లెక్కలు వేసుకుంటున్నారు. తమ పార్టీ గెలుస్తుందని వైసిపి చెబితే... కాదు కాదు తెలుగుదేశం కూటమి గెలుస్తుంది కొంతమంది అంటున్నారు. ఇలా విజయంపై ఎవరిని ధీమా వారిలో ఉంది. సర్వే సంస్థలు కూడా సిచువేషన్ చాలా కఠినంగా ఉందని చెబుతున్నాయి.
 ఏ పార్టీ విజయం సాధిస్తుందో చెప్పలేమని వెల్లడిస్తున్నాయి సర్వే సంస్థలు. అయితే ఇలాంటి నేపథ్యంలో పిఠాపురం వర్మ  కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నారట. వాస్తవానికి... పిఠాపురం అభ్యర్థిగా వర్మ ఉండాల్సింది.  పిఠాపురంలో వర్మ నిలబడితే కచ్చితంగా గెలిచే అభ్యర్థి. అయితే పవన్ కళ్యాణ్ కోసం ఆ సీటును వర్మ త్యాగం చేశారు.
 2009 సంవత్సరంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పిఠాపురం వర్మ... ఆ నియోజకవర్గంలో మంచి నేతగా దిగారు. అంతేకాకుండా 2014 సంవత్సరంలో ఇండిపెండెంట్గా అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు వర్మ. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు వర్మ. దీంతో 2019 టికెట్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సంపాదించుకున్నారు వర్మ. గ్రౌండ్ ప్రిపరేషన్ బాగా లేకపోవడంతో... అటు వైసిపి ఊపు కనిపించడంతో... పిఠాపురంలో వర్మ ఓడిపోయారు.
 ఈసారి టికెట్ వస్తుందనుకుంటే పవన్ కళ్యాణ్ అడ్డు నిలిచారు. అయినా సరే తెలుగుదేశం పార్టీ లైన్ కోసం పని చేసి....  పవన్ కళ్యాణ్ విజయం కోసం పాటుపడ్డారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ కచ్చితంగా గెలుస్తారని తెలుస్తోంది. దీనికి ముఖ్య కారణం పిఠాపురం వర్మ అని అంటున్నారు. అయితే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత... వర్మకి మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారట. అందుకే పవన్ కళ్యాణ్ కోసం బాగా పనిచేశారట వర్మ. ఇప్పుడు ఇదే అంశం ఏపీ రాజకీయాలలో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: