ఆ విషయంలో ఎలక్షన్ కమిషన్ డబల్ గేమ్ ఆడుతుంది...పేర్ని నాని..!

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తేదీన భారీ ఎత్తున అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సారి 2019 వ సంవత్సరం జరిగిన ఓటింగ్ కంటే కాస్త ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది. దానితో ప్రధాన పార్టీల నేతలు , నాయకులంతా ఈ సారి ఎక్కువ శాతం ఓటింగ్ జరగడం అనేది మా పార్టీ కి కలిసి వచ్చే అంశం అంటే మా పార్టీ కి కలిసి వచ్చే అంశం అని చెబుతూ వస్తున్నారు.

మరి ఈ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో కాస్త ఎక్కువ ఓటింగ్ శాతం జరగడం ఎవరికీ కలిసి అంశం అనేది జూన్ 4 వ తేదీన రిజల్ట్ డే రోజు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా వై సి పి పార్టీ కీలక నేతల్లో ఒకరు అయినటువంటి పేర్ని నాని ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన ఎన్నికల సంఘం పని తీరు విధానం పై కామెంట్స్ చేశారు. తాజాగా పేర్ని నాని మాట్లాడుతూ ... కేంద్రంలో మరియు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి లొంగిపోయి ఎన్నికల సంఘం పని చేస్తుంది అని ఈయన తాజాగా అన్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఎలక్షన్ కమిషన్ డబుల్ గేమ్ ఆడుతుంది అని ఆయన మండి పడ్డారు. తెలుగు దేశం పార్టీ తప్పులపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన ఎలక్షన్ కమిషన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కానీ ఏ పత్రికలో వార్తలు వచ్చిన వై సీ పీ నేతలపై మాత్రం కేసులు పెడుతున్నారు. ఎన్నికల సంఘం పై కోర్టులో పోరాడుతున్నాం. చివరికి న్యాయమే గెలిచి తీరుతుంది అని ఆయన అన్నారు. ఇకపోతే వై సీ పీ పార్టీ లో అత్యంత కీలక నేతలలో ఒకరు అయినటువంటి పేర్ని నాని ఎలక్షన్ సంఘం గురించి తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈయన అన్న మాటలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

pn

సంబంధిత వార్తలు: