కూటమి స్ట్రాంగ్ అనుకున్న వీకేనా..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ ల షెడ్యూల్ వచ్చే కంటే ఐదారు నెలల ముందు వై సీ పీ పార్టీ , తెలుగు దేశం , జనసేన , బి జె పి , కాంగ్రెస్ ఇవన్నీ సపరేట్ సపరేట్ గా పోటీ చేస్తాయి అనే ఉద్దేశంలో వై సి పి పార్టీనే స్ట్రాంగ్ గా ఉంటుంది. మరోసారి కూడా ఇదే పార్టీ అధికారంలోకి వస్తుంది అని అంతా భావించారు. ఇక ఆ తర్వాత దాదాపుగా ఇదే విషయాన్ని గమనించిన టిడిపి ఒంటరిగా వెళితే విజయం సాధించడం కష్టమే , అందుకే రాష్ట్రంలో మంచి బలమైన పార్టీలు అయినటువంటి జనసేన , బిజెపి పార్టీలతో జత కట్టింది. కాంగ్రెస్ కి పెద్దగా క్రేజ్ లేకపోవడంతో ఈ పార్టీ ఏమాత్రం ప్రభావాన్ని చూపది అనే ఉద్దేశంతో ఎవరు కూడా దీనిని పెద్దగా పట్టించుకోలేదు.

ఇక జగన్ మాత్రం ఒంటరిగా ముందుకు వెళ్లడానికే మొదటి నుండి రెడీగా ఉన్నారు. ఇక ఆ తర్వాత కూటమి పేరుతో తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. దానితో వైసిపి పార్టీ ఒంటరిగా ఉండడం , రాష్ట్రంలో మంచి క్రేజ్ కలిగిన మూడు పార్టీలు ఒకటిగా ఉండడంతో కూటమి సైడే జనాలు మొగ్గు చూపుతారు , అవలీలగా కూటమి అధికారం లోకి వస్తుంది అని అంతా అనుకున్నారు. దాదాపుగా ఎలక్షన్ ల వరకు కూడా ఇదే సేమ్ రిపీట్ అయింది. కానీ లాస్ట్ నిమిశ్లో మాత్రం పరిస్థితిలు మారినట్లు తెలుస్తోంది.

ఎలక్షన్ లకి రెండు , మూడు రోజుల ముందు పరిస్థితులు అన్నీ మారినట్లు వైసిపి పార్టీ తాము ఇచ్చిన సంక్షేమ పథకాలను జనాల్లోకి బాగా తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. దానితో కూటమి కంటే కూడా వైసిపి నే బెటర్ అనే ఆలోచనకు జనాలు వచ్చినట్లు , దానితో జనాలు ఎక్కువ శాతం వై సీ పీ వైపు మొక్కు చూపినట్లు తెలుస్తోంది. అదే కానీ జరిగితే స్ట్రాంగ్ అనుకున్న కూటమి వీక్ అయినట్లే అవుతుంది. మరి ఏ పార్టీ స్ట్రాంగ్ , ఏ పార్టీ వీక్ అయ్యింది అనేది జూన్ 4 వ తేదీన రిజల్ట్ డే రోజు క్లియర్ గా అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: