వైసీపీ విక్టరీ : విజయవాడ సెంట్రల్ లో మరోసారి ఎగరనున్న వైసీపీ జెండా..?

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి వై ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీలోకి దిగగా , మిగతా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి తెలుగు దేశం , జనసేన , బి జె పి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ రెండు వర్గాలు విజయవాడ సెంట్రల్ సీట్ పై చాలా కాన్సన్ట్రేషన్ పెట్టారు.

ఇకపోతే పోయిన సారి విజయవాడ సెంట్రల్ నుండి వై సి పి కాంగ్రెస్ పార్టీ మల్లాది విష్ణు ను బరిలోకి దింపారు. ఈయన భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక పోయిన సారి గెలుపొందడంతో ఈ సారి కూడా ఇక్కడ సీటును మల్లాది విష్ణు ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే వై సి పి నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఆలోచించి ఈ సారి ఈ ప్రాంత సీటును వెల్లంపల్లి శ్రీనివాసరావు కు అప్పగించారు.

ఇక కూటమి ఈ ప్రాంత అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు నియమించింది. ఇకపోతే మొదటి నుండి వీరిద్దరి మధ్య పోరు బలంగా ఉంటుంది అని అనుకున్నారు. ఒకానొక దశలో కూటమి కి బాగా వేవ్ కనిపిస్తూ ఉండడంతో , బోండా ఉమా చాలా అవలీలగా గెలుపొందుతారు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఓటింగ్ నాటికి సీన్ చాలా వరకు మారిపోయినట్లు తెలుస్తోంది.

వై యస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నుండి విజయవాడ ఏరియాపై మంచి దృష్టి సారించడం , అనేక అభివృద్ధి పనులు చేయడం , అలాగే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడంతో ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి వై సీ పీ సైడ్ జనాలు ఎక్కువగా ఆసక్తి చూపినట్లు , అందులో భాగంగా వేల్లంపల్లి శ్రీనివాస్ కే ఎక్కువ ఓటింగ్ విజయవాడ సెంట్రల్ లో జరిగినట్లు దానితో ఈయనే దాదాపుగా ఇక్కడి నుండే గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ ప్రాంతంలో వై సి పి పార్టీ జెండా ఎగురుతుంది. మళ్లీ కూడా ఇక్కడ వై సి పి నే గెలుస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: