టీడీపీ: కేంద్రం నుంచి లీకులు.. ఢీలా పడిపోయిన క్యాడర్..?
ఇతర ప్రాంతాలలో రాజకీయాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. సర్వే సంస్థలు కూడా ఫలానా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ప్రకటించాయి. ముఖ్యంగా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగడంతో ఎవరికి మేలు చేస్తుందో అని రాజకీయ పార్టీలు కూడా అంచనా వేయలేకపోతున్నారు. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ పైన రాజకీయ పార్టీలన్నీ కూడా ఆశలు పెట్టుకున్నాయి. ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి ఎగ్జిట్ పోల్స్ పైన పెద్దగా ఆశలు పెట్టుకోలేదని తెలుస్తోంది.
కేంద్రం నుంచి వచ్చిన నివేదికలలో కూడా కూటమి పైన పెద్ద సానుకూలత రిపోర్టింగ్ రాకపోవడంతో టీడీపీ నాయకులు సైతం చాలా డీలపడుతున్నట్లుగా సమాచారం.ఇవన్నీ చూస్తూ ఉంటే టిడిపి ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా వ్యతిరేకంగానే వస్తున్నాయని వార్తలు కేంద్రం నుంచి లీకులుగా వినిపిస్తున్నాయి.. ఈ విషయం టిడిపిలో ఎక్కువగా వినిపించడంతో క్యాడర్ కూడా డీలపడిపోయినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు టిడిపి కూటమిలోకి వస్తుందని భారీ బెట్టింగులు కాసిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఒక్కసారిగా అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ పరిణామాలను చూస్తూ ఉంటే ఎగ్జిట్ పోల్స్ పైన టిడిపి పెద్దగా ఆశలు పెట్టుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో జూన్ 4వ తేదీ చూడాలి.