ఏపీ: కదిరి నియోజకవర్గంపై రూ.10 లక్షల బెట్టింగ్.. అగ్రిమెంటు లెటర్ వైరల్...??

Suma Kallamadi
మే 13వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. జానకి ఆ తేదీ కంటే ముందు నుంచే ఏపీ ఎన్నికలపై బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో రిజల్ట్స్‌ వెలువడనున్నాయి. ఈ సమయంలో పందేలు మరింత జోరు అందుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ ఒక బెట్టింగ్ అగ్రిమెంట్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కదిరి నియోజకవర్గంపై సత్యసాయి జిల్లాకు చెందిన నల్లచెరువు మండల నాయకుడు, గాండ్లపెంట వైసీపీ నాయకుడు వేసుకున్న పందెం తాలూకా లెటర్ ఇది.
ఒకరేమో కదిరి నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందని పందెం కాస్తే మరొకరు టీడీపీపై బెట్టింగ్ కాసారు. ఎవరు ఓడిపోయినా రూ.10 లక్షలు ఇచ్చేటట్లు వారు అగ్రిమెంట్ లో పేర్కొన్నారు. కాగా ఈ లెటర్ బయటికి వచ్చి వైరల్ కావడం వల్ల చాలా మందికి చూసి షాక్ అవుతున్నారు. 10 లక్షలు పెడితే చాలా నష్టం వస్తుంది కదా అని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బెట్టింగ్ సరదా ఏంటో ఏమో అర్థం కావడం లేదు వీటి వల్ల చాలామంది ప్రాణాలు పోయాయని మరికొందరు పేర్కొన్నారు.
 ఇకపోతే ఏపీ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం లోపే ఎవరు గెలుస్తారని దాని పై పూర్తి క్లారిటీ వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు తాను 153 సీట్లతో గెలుస్తానని చెప్తున్నారు. మరోవైపు జగన్ తనకు 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అంటున్నారు. జూన్ 1 అంటే రేపు ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. వీటిలో కొన్ని ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి వాటిలో ఇండియా టుడే సర్వే ఒకటి అని చెప్పుకోవచ్చు. ఈ ఎగ్జిట్ పోల్స్ బయటికి వచ్చాక బెట్టింగ్స్ మరింత ఊపు అందుకునే అవకాశం ఉంది. చాలామంది టీడీపీ గెలుస్తుంది అని బెట్టింగ్స్ కాస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: