CPS సర్వే రిపోర్ట్: ఏపీలో 133 సీట్లతో వారిదే అధికారం.. ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుంది. మరో ఐదు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అదే రోజున సాయంత్రం ఫలితాలు వెలబడతాయి. ఒక్క నియోజకవర్గంలో ఫలితం రావడానికి రెండు గంటల సమయం పడుతుందని ఇప్పటికి అధికారులు తెలిపారు.


ఇక ఇలాంటి నేపథ్యంలో...  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఫలితాలపై ఒక్కొక్క సర్వే బయటపడుతోంది. సర్వే రిపోర్ట్ లు బయట పెట్టకూడదని  ఎన్నికల సంఘం తెలియజేసినప్పటికీ... సర్వే రిపోర్ట్ లు లీక్ అవుతూనే ఉన్నాయి. అయితే నిన్న నాగన్న సర్వే సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఈ సర్వే ప్రకారం ఏపీలో వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని తేలిపోయింది.

 
 ఇక ఇప్పుడు కూటమికి అనుకూలంగా మరో సర్వే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిపిఎస్  అనే నేషనల్ సర్వే సంస్థ...  ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తమ రిపోర్టును రిలీజ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సర్వే లెక్కల ప్రకారం తెలుగుదేశం కూటమి ఏపీలో అధికారంలోకి వస్తుందని పేర్కొందట. 2023 సంవత్సరంలో జరిగిన తెలంగాణ అలాగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఈ సిపిఎస్ సంస్థ సరిగ్గా అంచనా వేసినట్లు చెబుతున్నారు.

 
 ఇక ఏపీలో కూడా ఈ సర్వే నిజమవుతుందని తెలుగు తమ్ముళ్లు నమ్ముతున్నారు. ఈ సిపిఎస్ లెక్కల ప్రకారం తెలుగుదేశం కూటమికి 133  సీట్లు వస్తాయని తేలిపోయింది. అలాగే వైసిపి పార్టీకి 42 స్థానాలు మాత్రమే వస్తాయని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం కూటమి దుమ్ము లేపుతుందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఈ సర్వే రిపోర్ట్ బయటపడడంతో.. సిపిఎస్ సంస్థ స్పందించింది. తమకు ఈ సర్వేకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.  ఎవరో కావాలని ఇలా చేస్తున్నారని సమస్త చెప్పడం ఇప్పుడు వివాదంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: