మూడు దశాబ్దాల నిర్విరామ సర్వీస్ రికార్డు.. జవహర్ రెడ్డి ప్రస్థానం ఇదే..?

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు విశేషమైన సేవలను అందించారు. 1990, ఆగస్టు 20న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో ప్రొబేషనర్‌గా చేరడంతో అతని ప్రయాణం ప్రారంభమైంది. మూడు దశాబ్దాలకు పైగా ఆయన నిర్విరామంగా సర్వీస్ అందిస్తూ వస్తున్నారు. జవహర్ రెడ్డి అద్భుతమైన టాలెంట్ తో సాధారణమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ వివిధ ముఖ్యమైన పదవులను నిర్వహించారు. ఒకసారి ఆయన ప్రస్థానంపై లుక్కేద్దాం.
* జవహర్ రెడ్డి ప్రస్థానం
1991-1992: వరంగల్, మహబూబ్‌నగర్‌లలో అసిస్టెంట్ కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు.
1992-1994: నరసాపురంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా, ఆ తర్వాత భద్రాచలంలో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేశారు.
1996-1998: నల్గొండలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. తరువాత హైదరాబాద్‌లో DPEP ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
1999-2002: శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
2005-2008: HMWS & SB మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత HUDA వైస్ చైర్మన్ అయ్యారు.
2008-2009: హైదరాబాద్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమితులయ్యారు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఎండీగా విధులు నిర్వర్తించారు.
2009-2014: జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా వర్క్ చేశారు.
2015-2019: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి, ఆపై ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.
2020-2022: ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. జలవనరుల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు చేపట్టారు.
2022-ప్రస్తుతం: ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
జవహర్ రెడ్డి తన కెరీర్ మొత్తంలో, తాను సేవ చేసిన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనకున్న అపారమైన అనుభవంతో ఏపీని గొప్ప మార్గంలో నడిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు విశేషమైన సేవలను అందించారు. 1990, ఆగస్టు 20న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో ప్రొబేషనర్‌గా చేరడంతో అతని ప్రయాణం ప్రారంభమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: