జవహర్ రెడ్డి: పేరు వినగానే భయపడుతున్న కూటమి.. బిజెపి మాత్రం నో..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ప్రక్రియ జూన్ 4వ తేదీ జరగబోతోంది.. ఈసారి ఎన్నికలలో కూటమి,వైసిపి పార్టీలు పోటీ పడ్డాయి . ముఖ్యంగా టిడిపి పార్టీ బిజెపితో మిత్రపక్షం చేరిన తర్వాత దూకుడు వేరే లెవెల్లో సాగింది.. అయితే టిడిపి పార్టీ ఎవరిని బదిలీ చేయాలనుకున్నా.. చక చకపనులు జరిగిపోయాయి . దీంతో టిడిపి కూటమికి ఏపీలో  సీను ఒక్కసారిగా మార్చేసింది..  ఆ సమయంలోనే ఏకంగా బిజెపి రాజేంద్రనాథ్ రెడ్డి ని కూడా బదిలీ చేయగలిగారు. చాలా కీలకమైన పోస్టులలో ఉన్న వారిని కూడా మార్చేయడం జరిగింది. అయితే ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డిని మాత్రం ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యంగా ఆయన ప్లేస్ లో కొత్త వారిని తీసుకురావాలని టిడిపి కూటమి ఎన్నో ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించిన దాఖలు లేవు.  ఇటీవలే కొంతమంది నేతలు ఢిల్లీకి వెళ్లి మరీ అక్కడ చర్చలు జరిపినప్పటికీ ఫలించలేదు. ముఖ్యంగా సిఎస్  లాంటి సీనియర్ ని పక్కన పెట్టాలి అంటే అందుకు తగినంత బేస్ కూడా ఉండాలి.. అయితే కేవలం టిడిపి పార్టీ విశాఖ భూ కుంభకోణంలో జవహర్ రెడ్డి పాత్ర ఉందంటూ ఆరోపిస్తూ టిడిపి,  జనసేన నుంచి చాలా ఘాటుగానే విమర్శలు  వినిపించాయి.. ఇవన్నీ కూడా ఇప్పుడు కౌంటింగ్ వేళ తమను  దెబ్బ తీస్తాయనే  విధంగా టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

అందుకే ఆయనను కావాలనే తప్పించాలని టిడిపి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. అంతేకాకుండా కౌంటింగ్ వేళ కూడా ఏదో డౌట్ పడుతున్నామంటూ టిడిపి నేతలు తెలుపుతున్నారు. వాస్తవానికి అలాంటివేవీ కూడా ఉండవని చాలామంది నేతలు తెలియజేస్తున్నారు. కేవలం వారు పంతం నెగ్గించుకోవడానికి ఇదంతా ఇలా చేస్తున్నారు కానీ..బిజెపి టిడిపి కోరినటువంటి వారందరిని మార్చినా ఆ ఒక్కరీ విషయంలో మాత్రం తమదైన స్టైల్ లో వైఖరి చూపిస్తోంది. ఇకపోతే ఇక్కడ టిడిపి ఆయనను తప్పుపడుతూ అన్ని విషయాలను హైలెట్ చేస్తోంది.  దీనికి ప్రధాన కారణం ఆయన  రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా ఉంటాయి.. కాబట్టే టిడిపి టెన్షన్ పడుతోంది. అందుకే ఆయనపై అనవసరంగా లేనిపోని విమర్శలు చేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: