మోడీ మూడో కేబీనెట్ లో తెలుగు మంత్రులు వీళ్ళే..?

Veldandi Saikiran
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కంటే బిజెపి పార్టీ జోష్లో ఉంది. ఇప్పటికే అధికారం ఖరారు అయినట్లు బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు. 90 శాతం సర్వేలు కూడా బిజెపి పార్టీకి అనుకూలంగా రిపోర్టులు ఇచ్చాయి. అయితే మూడోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలు అయినా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పంట పండినట్లే అని విశ్లేషకులు చెబుతున్నారు.
 
తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బిజెపి నేతలకు  అని స్పష్టం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే... తెలంగాణ నుంచి మూడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికీ మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉన్నట్లు విశ్లేషణ చేస్తున్నారు. తెలంగాణ విషయానికి వస్తే... మంత్రి పదవి రేసులో కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్,  ఈటల, డీకే అరుణ, లక్ష్మణ్ లాంటి కీలక లీడర్లు... లైన్లో ఉంటారట.
 కిషన్ రెడ్డికి బిజెపి తెలంగాణ అధ్యక్ష పదవి అలాగే ఉంచితే.. డీకే అరుణకు ఈసారి ఛాన్స్ వస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు.  ముదిరాజు సామాజిక వర్గంలో ఈటల రాజేందర్ కు ఛాన్స్ ఉంటుందట. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి బండి సంజయ్ లైన్ లో ఉన్నారని తెలుస్తోంది. అయితే మందకృష్ణకు రాజ్యసభ ఇచ్చి... మంత్రిని చేయాలని అనుకుంటున్నారట మోడీ. అలా చేస్తే మాదిగలను సంతృప్తి చేసినట్లు ఉంటుందని చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడైన లక్ష్మణ్ కు కూడా ఛాన్స్ ఉందట.
 ఇక ఏపీ విషయానికి వస్తే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు రాజ్యసభ ఇచ్చి... కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని  అనుకుంటున్నారట. అటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి కూడా రెడ్డి సామాజిక వర్గం తరఫున బంపర్ ఆఫర్ రానుందట. ఇక టిడిపి నాయకుడు అయిన... రామ్మోహన్ నాయుడుకు కూడా ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా బిజెపి పార్టీ తరఫున పురంధరేశ్వరికి కచ్చితంగా ఈసారి మంత్రి పదవి వస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇలా మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బంపర్ ఆఫర్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: