టీడీపీ గెలవబోతోందంటూ ఒప్పుకున్న వైసీపీ కీలక నాయకుడు..??

Suma Kallamadi
వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాచర్లలో టీడీపీ గెలవబోతోందని పరోక్షంగా ఒప్పుకున్నారు. అక్కడ టిడిపి అభ్యర్థి గెలుస్తారు అని అర్థం వచ్చేలా మాట్లాడారు.పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం మాట్లాడుతూ మాచర్ల విజయం గురించి కూడా మాట్లాడారు. వైసీపీ రివోటింగుకు పిలుపునివ్వగా దానిపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "టీడీపీ సెగ్మెంట్‌లో మళ్లీ ఓటు వేయమని ఎందుకు పిలవడం లేదు? ఎందుకంటే వారికి రీవోటింగ్ లేకపోతేనే కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి! లేకపోతే ఎందుకు మౌనంగా ఉంటారు?" అని ఆయన ప్రశ్నించారు. మాచర్లలో మళ్లీ పోలింగ్ కి వెళ్దామని టీడీపీ ఎందుకు అడగడం లేదని సజ్జల ప్రశ్నించారు.
సాధారణంగా ఆల్రెడీ జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ సీటు గెలుస్తామన్న నమ్మకంతో ఉన్న పార్టీ రీపోలింగ్‌కు ఒత్తిడి చేయదు. టీడీపీ గురించి సజ్జల మాట్లాడిన తీరు చూస్తుంటే టీడీపీ మాచర్లలో కచ్చితంగా గెలవబోతోందని అందుకే రీపోలింగ్ వారు ససే మీరా అంటున్నారని అర్థమవుతోంది. సజ్జల ఇంకా మాట్లాడుతూ, చంద్రబాబు చాలా మంచి వ్యూహకర్త అని, నరేంద్ర మోదీ కూడా ఆయనకు సాటి రారని పేర్కొన్నారు. సజ్జల ప్రకారం చంద్రబాబు కూడా అంతటి రాజకీయ వ్యూహకర్త  అయిన మోదీని సైతం తనను ఫాలో అయ్యేలా చేయగలరు.
బీజేపీ ద్వారా కుటమికి అనుకూలంగా ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు ప్రభావితం చేశారని సజ్జల చెప్పాలనుకున్నారు కానీ చివరికి ఆయనకు తెలియకుండానే టీడీపీని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రశంసించి షాక్ ఇచ్చారు. సజ్జల మాచర్ల లో టీడీపీ గెలవబోతోందని పరోక్షంగా అంగీకరించిన మాటలకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గాను మారింది.
ఇకపోతే మాచర్లలో టీడీపీ గుండాలు చాలా పెద్ద బీభత్సం సృష్టించారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి వారు రిగ్గింగ్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక మహిళలను బెదిరించి వారి స్థానంలో వీరు ఓట్లు వేసినట్లు కూడా ఆరోపణలు వినిపించాయి. అయితే వీరి అరాచకాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్తే ఎవరూ కూడా పట్టించుకోలేదని, దాని కారణంగా ఈవీఎం ను బద్దలు కొట్టానని పిన్నెల్లి చెబుతున్నారు. మొత్తం మీద ఈసారి పల్నాడు జిల్లాలోని మాచర్ల ఫ్యాక్షనిజాన్ని మళ్లీ నిద్రలేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: