ఏపీ: ఎగిరెగిరి పడిందిగా.. షర్మిలకు డిపాజిట్లు కూడా రావట..??

Suma Kallamadi
సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సమయం నుంచి రాజకీయ పార్టీ నేతల్లో చాలా టెన్షన్ ఉంటుంది. ఈ సారి గెలుస్తామా లేదా? ప్రజలు తమను నమ్మి ఓట్లు వేస్తారా? అని ఆలోచిస్తూ ఉంటారు. అవతల పార్టీ వాళ్లు ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటే వారి వ్యూహాలను చిత్తు చేస్తూ ప్రజలను తమ వైపే ఉంచుకోవలసిన అవసరం అధికార పార్టీ నేతలు ఉంటుంది. ఇక సర్వేలు వారిని మరింత భయపెడుతుంటాయి. ఎన్నికల లెక్కింపు తేదీ ఈసారి చాలా డేస్ వాయిదా పడింది. మే 13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసాయి. పిఠాపురం, కుప్పం, కడప పార్లమెంటు స్థానాల్లో ఈసారి ఎవరు గెలుస్తారని మరింత ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా జగన్ సోదరి షర్మిల కడప నుంచి వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఈసారి పోటీ చేస్తున్నారు. అవినాష్ వైఎస్ ఫ్యామిలీకి చెందిన వారే. ఆయన షర్మిలకు తమ్ముడు వరస అవుతారు. షర్మిల తన అన్న జగన్ ను విమర్శిస్తూ అవినాష్ రెడ్డి ఒక హంతకుడు అని ఆరోపిస్తూ కడప జిల్లా అంతటా తిరిగారు. హంతకుడికి కాకుండా తనకే ఓట్లు వేయాలని ప్రజలను బాగా బతిలాడారు. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతతో కలిసి ఆమె ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. చివరికి షర్మిల అతనికి ఓటు వేయాలంటూ కంటతడి కూడా పెట్టుకున్నారు. కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలుస్తోంది.
తాజాగా ది పొలిటికల్ ఎడ్జ్ అనే ఒక జాతీయ సంస్థ పోస్ట్ పోల్స్ ప్రకారం షర్మిలకు డిపాజిట్లు కూడా దక్కవు అని వెల్లడించింది. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఆమెకు ఉపయోగపడుతుందని చాలామంది అనుకున్నారు కానీ అది రివర్స్ అయ్యింది. అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం మీద రెండో అతిపెద్ద మెజారిటీని గెలుచుకుపోతున్నారని ఈ జాతీయ సంస్థ అంచనా వేసింది.
అయితే షర్మిల ఒకవేళ డిపాజిట్లు కోల్పోతే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆమెను గుడ్డు మీద ఈకలాగా తీసివేస్తారు. డిపాజిట్లు కూడా తిరిగి రాలేదు ఇక మీతో ఏమవుతుంది అని చులకనగా చూస్తారు. మళ్లీ ఆమె కాంగ్రెస్ లో ఉండి పుంజుకునే అవకాశం ఉండదు. ఇక జగన్ గెలిస్తే ఆమె పొలిటికల్ కెరీర్ ముగిసినట్లే. ఒకవేళ జగన్ ఓడిపోతే ఆమెకు కాంగ్రెస్ పార్టీలో ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: