చంద్రబాబులో ఆ ఒక్కటి చూసి రాయలసీమ ఓట్లన్నీ ధనాధన్ పడిపోయాయా..??

Suma Kallamadi
రాయలసీమ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో గెలిచిన వారే సీఎం అవుతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇక్కడ నిల్చున్న అభ్యర్థులు చాలా డబ్బు ఖర్చు చేశారు, ఓటర్లకు అనేక బహుమతులు ఇచ్చారు. అలానే రాయలసీమ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేశామని, గతంలో కొన్ని వర్గాలకు ప్రయోజనాలు కల్పించామని, దీనివల్ల తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఈసారి తమ విజయాన్ని ఖాయం చేస్తాయని వారు భావిస్తున్నారు.
కొందరు అభ్యర్థులు తమ పార్టీ కంటే తమ వ్యక్తిగత పలుకుబడి ఆధారంగా గెలుస్తారని నమ్ముతున్నారు.  ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఇమేజ్ ఒకటి చూసి రాయలసీమ ప్రజలందరూ కోట్లు గుద్దేసి ఉంటారని అంటున్నారు. మరోవైపు జగన్ ఇమేజ్, సంక్షేమ పథకాలు, మంచి పోల్ మేనేజ్‌మెంట్, సానుకూల ఓటరు సెంటిమెంట్ కారణంగా తాము గెలుస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విశ్వసిస్తున్నారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు ఇమేజ్ వల్ల కాకుండా వ్యక్తిగత చరిష్మా వల్లే గెలుస్తామని కొందరు టీడీపీ అభ్యర్థులు వాదిస్తున్నారు. చంద్రబాబు మేనిఫెస్టో, వాగ్దానాలు తమకు ఓట్లు లక్షల్లో తెచ్చి పెడతాయనే నమ్మకం ఈ టీడీపీ అభ్యర్థులకు లేదు. బదులుగా, చంద్రబాబు పట్ల ఉన్న సెంటిమెంటు, విశ్వాసం కారణంగా ప్రజలు తమకు ఓటు వేసి ఉంటారని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా కూటమి నుంచి కడప జిల్లా అభ్యర్థులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు డబ్బు కూడా ఆ విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల ఈసారి కచ్చితంగా గెలుస్తామని అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.
 ఇకపోతే జూన్ 4వ తేదీన పార్లమెంటు ఓట్లను లెక్కిస్తారు అలాగే ఏపీలో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది ఈరోజుతో సీఎం ఎవరనేది తేలిపోతుంది. చంద్రబాబు తన గెలుస్తానని నమ్మకం వ్యక్తం చేస్తుంటే జగన్ మాత్రం 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అంటున్నారు. ఈ క్రమంలో  చాలా కొత్త సర్వేలు తెరపైకి వస్తున్నాయి వీటిలో కొన్ని వైసీపీ గెలుస్తుంది అని చెబుతుంటే మరికొన్ని టీడీపీ విజయం సాధిస్తుంది అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: