ప్రాణాపాయ స్థితిలో చంద్రబాబు.. కాపాడడానికి డాక్టర్లు శతవిధాలా ప్రయత్నం..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఒక వార్తను సర్కులేట్ చేయడం ప్రారంభించింది 
. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రబాబు నాయుడు పాత చిత్రాన్ని వైసీపీ సోషల్ మీడియా టీమ్స్ వైరల్ చేయడం ప్రారంభించాయి. ఆ ఫోటో గతేడాది నాటిది కాగా ఇప్పటి చంద్రబాబు ఫోటో లాగా వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతున్నారంటూ  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్ మీడియా ఆరోపిస్తోంది. చంద్రబాబును ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారని, స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఆయనకు ట్రీట్ చేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టింది. చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు ఒక ఆందోళన కనిపించేటట్టు వైసీపీ ఈ ప్రచారాన్ని కొనసాగిస్తోంది.
ఒక గూగుల్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వైసీపీ వాళ్లు ఇప్పుడు వైరల్ చేస్తున్న పిక్ 2023 నాటిది అని చూపిస్తుంది. దానిని చూడటం ద్వారా, అందులో ఉన్నది USలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆసుపత్రిలా కనిపించడం లేదని, వైద్యుడు స్పష్టంగా భారతీయుడని టీడీపీ మీడియా స్పష్టం చేస్తోంది. ఎప్పటో ఫోటో ఇప్పుడు షేర్ చేస్తూ  ఒకరి ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం నిజంగా నీచమైన రాజకీయం అని, రాజకీయాలు విచక్షణమైన ఆలోచనలతో ఉండాలి తప్ప ఈ స్థాయికి దిగజారకూడదు అని మండిపడుతున్నారు.
దీనికి ప్రతీకారంగా, టీడీపీ మద్దతుదారులు ఇలాంటిదే ఏదైనా చేయవచ్చు, అలా చేస్తే ఈ ఫేక్ ప్రచారాలు ఎప్పటికీ ముగియవు. వైసీపీ అట్టడుగు స్థాయి నుంచి అగ్రనాయకత్వం వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను డర్టీ గేమ్‌గా మార్చేసిందని టీడీపీ మీడియా ఫైర్ అవుతోంది. మహిళలు, కుటుంబాలపై నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పటికే చూశామని, ఇప్పుడు ఇలాంటి దుష్ప్ర‌చారానికి కూడా వైసీపీ పాల్పడడం సిగ్గుచేటు అని అంటున్నారు.
ఈ ప్రచారం సోషల్ మీడియా టీమ్‌లలోని కొందరు నడుపుతున్నట్లయితే, వారికి నాయకత్వం వహించే సజ్జల భార్గవ్ రెడ్డి వాటిని సరిదిద్దాలి. ఇది ప్రణాళికాబద్ధమైన ప్రచారం అయితే, ఆంధ్రప్రదేశ్‌ను ఆ దేవుడే కాపాడాలి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: