జగన్: ప్రమాణస్వీకారం అంటూ హింట్ ఇచ్చిన టిడిపి నేత..!
ఈ విషయం పైన నెల్లూరు టిడిపి నేత అన్నం వెంకట్రామిరెడ్డి ట్విట్టర్లో వీరికి మద్దతుగా ఒక ట్విట్టుని షేర్ చేశారు.. విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం పైన రాష్ట్రంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో భాగంగా ఇప్పటికే విశాఖపట్నంలోని హోటల్స్ అడ్వాన్స్ బుకింగ్లు కూడా అయిపోయాయని ట్రావెల్ టికెట్లు కూడా ముందుగానే బుక్ అయిపోయాయని విధంగా తెలియజేశారు దీనిపైన.. మరొకసారి ఈ ప్రచారాన్ని గుర్తుచేస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ షేర్ చేశారు.
విశాఖ టికెట్ ధరలు భారీగా పెంచేసిన ప్రైవేటు ట్రావెల్స్.. 8, 9వ తేదీలలో వైజాగ్ లో సీఎం జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందంటూ వైసీపీ వైజాగ్ కు వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు.. సీఎం జగన్ అభిమానుల ప్లానింగ్ ఇదే అదునుగా విశాఖ టికెట్ ధరలు భారీగానే పెంచేసిన ప్రైవేటు ట్రావెల్స్ అంటూ తన ట్విట్టర్ నుంచి ఆనం వెంకటరామిరెడ్డి తెలియజేశారు.. తద్వారా ఫలితాలు రాకుండానే జగన్ అభిమానులు చేస్తున్న ఈ హంగామాను ప్రస్తావించారు. ఇప్పటికే జగన్ పైన నిత్యం విమర్శలు చేసే నేతగా పేరు చేసుకున్న అనం ఇలాంటివి పెట్టేసరికి వైసిపి అభిమానులు వీటి పైన ఎలా స్పందిస్తారు చూడాలి మరి.. ప్రస్తుతం అనం వెంకట్రామిరెడ్డి షేర్ చేసిన ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.