ఏపీ : అంబటిని ఆ భయం వెంటాతుందా..?

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.. ఎన్నడూ లేనంతగా యువత ఈసారి భారీగా పోలింగ్ లో పాల్గొన్నారు. దూర ప్రాంతాలలో వున్నా  కూడా ఈ సారి ఆంధ్రా కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరు ఊహించని విధంగా తీర్పును ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో మే 13 న పోలింగ్ ప్రశాంతంగా జరిగింది..అప్పటి నుంచి రాష్ట్రంలో నరాలు తెగే ఉత్కంఠత నెలకొంది.. ఈ సారి ఎవరు అధికారంలోకి వస్తారు అని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే సత్తెనపల్లి నియోజకవర్గం గెలుపుపై ఈ సారి ప్రజలలో మరింతగా ఆసక్తి నెలకొంది. ఈ సారి సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు బరిలో నిలిచారు. టీడీపీ కూటమి అభ్యర్థి గా కన్నా లక్ష్మి నారాయణ పోటీలో నిల్చున్నారు. అయితే ఈ సారి పోలింగ్ సమయంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా భారీగా గొడవలు జరిగాయి.టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఒకరిపై ఒకరు దారుణంగా దాడి చేసుకున్నారు.. 

వైసీపీ స్ట్రాంగ్ లీడర్ గా వున్న అంబటి రాంబాబు ను ఎలాగైనా ఓడించాలని టీడీపీ వర్గాలు ఎంతో గట్టిగా ప్రయత్నించాయి..పోలింగ్ రోజు టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడినట్లు వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ఈసీకీ ఫిర్యాదు చేసారు. అలాగే రీసెంట్ గా ఈవీఎం పగలగొట్టిన కేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి పై ఈసీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడంతో పిన్నిల్లికి సపోర్ట్ గా నిలిచిన అంబటి రాంబాబు సత్తెనపల్లి కొన్ని పోలింగ్ బూత్ లలో రిగ్గింగ్ జరిగిందని మళ్ళీ రీ పోలింగ్ జరపాలని హై కోర్ట్ లో పిటిషన్ వేశారు. అయితే అంబటి పిటిషన్ను హై కోర్ట్ కొట్టివేసింది. దీనితో అంబటికి గెలుపు భయం పట్టుకుంది. పోలింగ్ మానేజ్మెంట్ లో పట్టున్న కన్నా లక్ష్మినారాయణ ఈ సారి పోలింగ్ బూత్ లపై పూర్తి దృష్టి పెట్టడంతో దాదాపు టీడీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. దీనితో ఆ నియోజకవర్గంలో అంబటి ఓడిపోతే తరువాత ఆయన పరిస్థితి ఏంటా అని అంతా ఆలోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: