ఏపీ ఎన్నికలు.. సర్వేలు: జగన్‌కు షాకిచ్చిన పాపులర్ నేషనల్ మీడియా.. బాబోరు ఫుల్ హ్యాపీస్‌..?

Suma Kallamadi
అధికార వైఎస్‌ఆర్‌సీపీకి, ప్రతిపక్ష టీడీపీ, ఎన్డీయేకి గట్టిపోటీ ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు కీలకంగా మారాయి. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పోటీ పడుతున్నారు. ఏపీ ఎన్నికలపై జాతీయ, స్థానిక లెవెల్స్‌లో అనేక సర్వేలు జరిగాయి. దాదాపు అన్నీ సర్వేలు వైసీపీ విజయం సాధిస్తుందని చెబితే కొన్ని మాత్రం టీడీపీ+ కూటమి గెలవచ్చని అంచనా వేసాయి.
ప్రధాన జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే గ్రూప్ కూడా సర్వే జరిపింది. 17 లోక్‌సభ నియోజకవర్గాలత ap లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, ఎన్‌డీఏ కూటమి క్లీన్‌స్వీప్ చేయగలవని అంచనా వేసింది. అధికార వైస్సార్సీపీ కేవలం 8 mp సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు ఇవే ఫలితాలు ప్రతిబింబిస్తాయని అంచనా వేసింది. ఈసారి ఎన్నికల్లో వైసీపీ పార్టీకి 41 శాతం మాత్రమే ఓట్లు పడతాయని, టీడీపీకి 45 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది పోయినసారి 49 శాతం ఓట్లతో వైసిపి అధికారంలో పోయి వస్తే ఈసారి 45% ఓట్లతో టీడీపీ అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడింది. పోయినసారి తెలుగుదేశం పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయి.
ఈసారి ఏపీలో ఎన్‌డీఏకి రెండు శాతం వరకు ఓట్లు పెరిగే అవకాశం. ఈ సర్వే ప్రకారం టీడీపీ 130 అసెంబ్లీ సీట్లు గెలుచుకోనుంది. కాంగ్రెస్ ఇతరుల కంటే తక్కువ ఓటు శాతంతో సరిపెట్టుకుంటుంది. ఇండియా టుడే సర్వేలను చాలామంది నమ్ముతారు. ఎందుకంటే గతంలో చాలాసార్లు ఇవి నిజమయ్యాయి. అంత మాత్రాన ఈసారి ఏపీ ఎన్నికలపై దాని సర్వే కరెక్ట్ అవుతుందని చెప్పలేము. మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ ఎప్పుడైనా చేంజ్ కావచ్చు. సర్వే నెల రోజుల పైగానే ప్రచురించడం జరిగింది. ఇకపోతే తన ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలలో వైసీపీ క్లీన్ విక్టరీ సాధిస్తుందని తేలింది. ఈ సర్వేలు కూడా ఎక్కువ శాతం ఆక్యురేట్ ప్రేడిక్షన్స్‌తో ఇండియాలో ఫేమస్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: