సీఎం రేవంత్ కు పదవి గండం..అందుకే సీతక్క పీసీసీ అవుతోందా.?

Pandrala Sravanthi
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వారు అధికారం చేపట్టినప్పటి నుంచి  ఇప్పటివరకు 6 గ్యారంటీలలో  మూడు గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేశారు అవి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నాయి. ఇదే క్రమంలో ఇంకా మూడు గ్యారెంటీలు అమలులో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవి అమలులో కాకపోవడానికి ప్రధాన కారణం  ఎన్నికల కోడ్. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల పాటే సమయం ఉంది  ఇంతలో ఈ మూడు గ్యారెంటీ అమలు చేశారు ఇంకా మూడు గ్యారెంటీలు అమలు చేద్దామని అనుకునేసరికి ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది. ఈ సందర్భంలోనే  పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసాయి. ఇక స్థానిక సంస్థల ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటన వచ్చింది. కానీ ప్రజల్లో చాలా వ్యతిరేకత కనిపిస్తోంది.  

100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పటివరకు చేయలేదని ఆలోచన ప్రజల్లో ఉండడంతో కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కాస్త వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇచ్చిన హామీల్లో భాగంగా మిగతా పథకాలు కూడా ఈ కొన్ని రోజుల్లో అమలు చేస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుందనే ఆలోచనలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారట. ఇదంతా ఒకపక్క నడిస్తే మరోపక్క  పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ నాయకులంతా విపరీతంగా పోటీ పడుతున్నారు. వచ్చేనెల రేవంత్ పీసీసీకీ మూడేళ్లు గడుస్తుంది. ఈ సందర్భంలోనే మరో కొత్త పిసిసిని ఎన్నుకోవాలి. దీనికోసం ఇప్పటికే 10 మందికి పైగా సీనియర్లు పోటీలో ఉన్నారు.

 ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కిగౌడ్, జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్,  వంటి మరికొంత మంది నేతలు  తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇదే తరుణంలో అనూహ్యంగా సీతక్క పేరు తెరపైకి వచ్చింది. సీతక్కకి ఈ పదవి ఇవ్వాలని రేవంత్ కూడా అధిష్టానానికి సూచిస్తున్నట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.పీసీసీ  చీఫ్ అంటే పార్టీకీ సంబంధించి అన్ని వ్యవహారాలు వారి చేతుల్లోనే ఉంటాయి. అది ఎవరు అయినా, వాళ్లు చెప్పిన మాట పార్టీ వర్గాలందరూ వినాల్సిందే.  అందుకే సీఎం రేవంత్ రెడ్డి తనకు ఎంతో నమ్మిన బంటుగా ఉండే శీతక్కకే ఈ పదవిని ఇవ్వాలని కోరుతున్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.  సీతక్క కాకుండా మరో నాయకుడికి ఈ పదవి వెళితే సీఎం రేవంత్ రెడ్డి పదవికి గండం వస్తుందని భయపడుతున్నారట.

ఎందుకంటే ఇప్పటికే సీఎం రేసులో బట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా పోటీపడ్డారు.  వాళ్లందరి నుంచి కాపాడుకొని చివరికి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఈ క్రమంలోనే పీసీసీ పదవి వారి చేతిలోకి వెళితే నా సీఎం పదవికి కూడా  చెక్ పెడతారని ఆలోచనతో  రేవంత్ రెడ్డి కూడా శీతక్కకు పదవి ఇవ్వాలని ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో, అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏమో ఇవన్నీ ఉట్టి పుకార్లే , పీసీసీ చీప్ పదవి అనేది అధిష్టానం నిర్ణయం మేరకే అంతా కట్టుబడి ఉంటామని అంటున్నారు. మరి చూడాలి ఎంతో కీలకమైన పీసీసీ ఎవరిని వరిస్తుందో ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: