ఏపీ: బెట్టింగ్ అంటే భయపడుతున్న తెలుగు తమ్ముళ్లు..!

Divya
ఎలక్షన్స్ వచ్చాయి అంటే చాలు చాలా మంది బెట్టింగులు వంటివి చేస్తూ ఉంటారు. బెట్టింగులు నిషేధించినప్పటికీ కూడా ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇవి చేయడం చట్టబద్ధమైన నేరము.. కానీ ఆ బెట్టింగుల గురించి ప్రచారాలు వ్యవహారాలు మాత్రం నడుస్తూనే ఉంటాయి. ఒక ప్రధానమైనటువంటి అంశం బెట్టింగ్లకు సంబంధించి ఇప్పుడు తాజాగా  వెలుగులోకి వచ్చినటువంటి  అంశం ఏమిటంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఒక్కరు కూడా బెట్టింగ్ వేయలేదు.. అందరూ టిడిపి గెలుస్తుందని బెట్టింగ్ వేస్తున్నారని టిడిపి నేతలు తెలియజేస్తూ ఉన్నారు. రూపాయికి ఐదు రూపాయల వరకు ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

బెజవాడ, గుంటూరు వంటి క్లబ్బులలో పెద్ద ఎత్తున ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు ఏం చెబుతున్నారంటే.. 5 లక్షలు 10 లక్షలు రేంజ్ బెట్టింగులు నడుస్తున్నాయి.. అది కూడా బెజవాడ, గుంటూరు దగ్గర నడుస్తున్నాయి. వైసీపీ గెలుస్తుందని కోటి రూపాయలు కడతామన్నా కూడా కట్టించుకోవడం లేదు.. ఇది ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి చేస్తున్నారు తప్పించి.. ఏమీ లేదని తెలుపుతున్నారు వైసిపి నేతలు తెలియజేస్తున్నారు.

వైసీపీ నేతలు కోట్లల్లో పందాలు కాయడానికి సిద్ధమయ్యారట. మొదట ఓకే అని చెప్పిన చాలా మంది నేతలు మళ్లీ తప్పుకుంటున్నారని కూడా తెలియజేస్తున్నారు. అయితే కోటి రెండు కోట్ల రూపాయలు బెట్టింగ్ వేయడానికి టిడిపి నేతలు సిద్ధపడడం లేదట.. చివరికి 5000 ,10,000 ,50,000 వరకు మాత్రమే వేసుకుంటున్నారట. అది కూడా యాప్ల ద్వారా కూడా బెట్టింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో టిడిపి కేవలం  ఒక మైండ్ గేమ్ నడుపుతున్నారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. దాని వెనకాల ఏదో ఉద్దేశం  ఉందన్నటు వంటిదనేదే వైసిపి నేతలు అనుమానమని తెలుస్తోంది. మరి అది ఏంటో తేలాల్సి ఉన్నది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలుపడబోతున్నాయి. మరి ఆరోజున ఎవరు లెక్కలు తేలుతాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: