జగన్ తప్పులను సరిచేస్తున్న నారా లోకేష్‌ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం... పాలనపై దృష్టి పెట్టింది. ఇక ఇందులో... కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన... నారా లోకేష్  దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. మంగళగిరిలో ప్రజాదర్బార్  నిర్వహిస్తూనే... విద్యాశాఖ బాధ్యతలను కూడా  చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో... జరిగిన అవకతవకలను వెలికి తీస్తున్నారు.

 
విద్యా దీవన, వసతి దీవెన లాంటి పథకాల నిధుల కేటాయింపుల వివరాలు తెలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మొదట నిరసన సెగ తగిలింది టీచర్లదే. ఇటు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం ఉపాధ్యాయులే. ఈ తరుణంలో... టీచర్లకు న్యాయం జరిగేలా... బదిలీలు చేపడుతున్నారు నారా లోకేష్. ఇక నుంచి పారదర్శకంగా టీచర్ల బదిలీలు ఉంటాయని.. ఇప్పటికే చెప్పారు.

 
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫేస్ రికగ్నైజేషన్ నిబంధన కారణంగా టీచర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఆ వ్యవస్థను రద్దుచేసి...  ప్రత్యామ్నాయ పద్ధతిని తీసుకువచ్చే దిశగా నారా లోకేష్ ఫోకస్ చేస్తున్నారట. అంతేకాకుండా యూనివర్సిటీలలో.. పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయట. వాటిని కూడా భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కార్డు వైఎస్సార్ జిల్లా విద్యాశాఖ అధికారులపై.. నారా లోకేష్ కు ఎమ్మెల్సీ భూమిరెడ్డి  ఫిర్యాదు చేశారు.


ఆ విద్యాధికారులపై అవినీతి, అక్రమాల ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి... ఆ అధికారుల లెక్కలు కూడా తేల్చబోతున్నారు నారా లోకేష్. విద్యార్థులకు... పుస్తకాలు అందించడం, బైజుస్ కంటెంట్ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడంపై నారా లోకేష్ ఫోకస్ పెట్టారు. ఇలా అడుగడుగునా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లో జరిగిన...  తప్పిదాలను వెలికి తీసి... వాటిని సెట్ చేస్తున్నారు నారా లోకేష్. ఇక గత సర్కార్‌ లో జరిగిన అవినీతిని బయటకు తీసి...ప్రజా క్షేత్రంలో పెట్టే దిశగా నారా లోకేష్‌ అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: