నాని దెబ్బకు ఆలోచనలో పడ్డ దిల్ రాజు... ఏం చేయనున్నాడో తెలుసా..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని హీరోగా బలగం వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఓ మూవీ ని నిర్మించడానికి అన్ని ఓకే చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరి కాంబినేషన్లో మూవీ ఆల్మోస్ట్ సెట్ అయింది అని వార్తలు కూడా వచ్చాయి. ఇకపోతే వేణు కొన్ని రోజుల క్రితం ఈటీవీ లో ప్రసారం అయినటువంటి ఆలీతో సరదాగా అనే షో కు విచ్చేశాడు. అందులో భాగంగా ఆలీ , నాని తో సినిమా ఓకే అయ్యిందంట కదా అని అడగగా ... ఆల్మోస్ట్ ఓకే అయ్యింది సార్. కాకపోతే హీరో నుండి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాలి అని చెప్పాడు.

దానితో వీరి కాంబోలో సినిమా కన్ఫామ్ అయ్యింది అని జనాలు అంతా అనుకున్నారు. కాకపోతే ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. వేణు సూపర్ సాలిడ్ స్టోరీ నే రెడీ చేసుకొని తాజాగా నాని కి వినిపించాడట. కథ సూపర్ గానే ఉన్నప్పటికీ వేణు చెప్పిన క్యారక్టరైజేషన్ నాని కొంతకాలం క్రితం నటించిన దసరా క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉండడంతో ఆయనపై ఈ సినిమా సెట్ కాదు అనే ఉద్దేశంతో నాని ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే దిల్ రాజు ఈ సినిమా కథ విని అద్భుతంగా ఉంది అనే అభిప్రాయానికి వచ్చాడట.

దానితో నాని ఇది వరకే ఇలాంటి సినిమా చేసి ఉండడంతో ఆయనపై ఈ కథ సెట్ కాదు కావచ్చు కానీ వేరే హీరోతో ఈ స్టోరీని తీస్తే సూపర్ గా సెట్ అవుతుంది అనే ఉద్దేశంలో ఆయన ఉన్నట్లు అందులో భాగంగా ఈ కథ కోసం ఒక హీరోను సెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు యూఎస్ఏ లో వెకేషన్ లో ఉన్నాడు. వెకేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కి వచ్చాక వేణు తయారు చేసిన కథకి సరిపోయే హీరోను దిల్ రాజు వెతకబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

dr

సంబంధిత వార్తలు: