స్టార్ హీరోస్ అవుతారనుకున్న ఈ ముగ్గురి కెరియర్.. నాశనం కావడానికి కారణం అదేనా?

praveen
సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో నిలదొక్కుకోవడం అనేది నిజంగా ఎంతో కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే ఇక కెరియర్ ను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడినప్పటికీ కొన్ని కొన్ని సార్లు అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక ఈ అదృష్టం లేకనే ఎంతోమంది టాలెంటెడ్ హీరో, హీరోయిన్స్ సైతం ఇండస్ట్రీలో కనుమరుగైన వారు ఉన్నారు. అయితే కాస్త టాలెంట్ తక్కువగా ఉన్న అదృష్టం కలిసి వచ్చి స్టార్లు ఎదిగిన వారు కూడా లేకపోలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇలాంటి ముగ్గురు హీరోల గురించే. వాళ్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో స్టార్ హీరోలు అవ్వడం పక్క అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో కనిపించకుండా పోయారు. వాళ్ళు ఎవరో చూసుకుంటే..
 వరుణ్ సందేశ్  : మొదటి సినిమా హ్యాపీ డేస్ సూపర్ హిట్.. ఇక తర్వాత వచ్చిన కొత్త బంగారులోకం యూత్ ఆకట్టుకుని ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీస్ చూశాక అతను స్టార్ అయిపోతారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు తీయలేదు.ఇక కథల ఎంపికలో తడబడ్డాడు. దీంతో చివరికి అతను ఇండస్ట్రీలో కనిపించకుండా పోయాడు.
 రాజ్ తరుణ్ : ఉయ్యాల జంపాల సినిమాతో రాజ్ తరుణ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుని మంచి వసూలు సాధించింది. దీంతో రాజ్ తరుణ్ స్టార్ హీరో అవ్వడం పక్క అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలతో పర్వాలేదు అనిపించినా.. కథలు ఎంపిక బాగోలేక చివరికి కెరియర్ని చేజేతులారా  నాశనం చేసుకున్నాడు.

 ఆది సాయికుమార్  : ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్న సాయికుమార్ నట వారసుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు ఆది. ఇక ప్రేమ కావాలి అనే సినిమాతో మొదటి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ప్రేక్షకులను  ఆకట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎందుకో సక్సెస్ కాలేకపోయాడు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో కనుమరుగైపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: